MAHARASTRA: దేశంలో రైతు ప్రభుత్వం రావాలి – నాందెడ్ సభలో సీఎం కేసీఆర్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2023 | 11:19 AMLast Updated on: Feb 05, 2023 | 11:19 AM

Maharastra దేశంలో రైతు ప్రభుత్వం ర

బీఆర్‌ఎస్‌ పార్టీ నాందేడ్‌లో నిర్వహిస్తున్న పక్ష ప్రవేశ సోహాల్ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ సభాస్థలికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న తరువాత నాందేడ్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి (భారాస)ని దేశమంతా విస్తరించాలన్న లక్ష్యంలో సీఎం కేసీఆర్‌ తొలి అడుగు వేశారు. తెలంగాణేతర ప్రాంతంలో తొలిసభను ఆదివారం నిర్వహించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సభకు రెండు వారాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు సభ విజయవంతం కోసం మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసిస్తున్న గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

జాతీయ పార్టీగా ఆవర్భవించాక.. పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే కావడం విశేషం. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం కేసీఆర్ నాందేడ్ సభలో ప్రసంగించారు. నాందేడ్ జిల్లాలోని సౌత్, నార్త్, బోకర్, నాయిగాం. ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్పట్, ధర్మాబాద్ మండలాల నుంచి భారీ జనసమీకరణ చేశారు. వీటితో పాటు.. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోథ్, మథోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజవర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ శ్రేణులను తరలించారు. తెలంగాణ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతోన్న తొలి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు 25 వేల మందికిపైగా సభకు వచ్చారు. ఇక నాందేడ్‌కు చెందిన పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సభకు హాజరైన నాందేడ్‌ మహిళలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఆహ్వానించారు. తెలంగాణలో వచ్చినట్లు తమకు పించన్‌ రావడం లేదని. కేవలం రూ. 500 పెన్షన్‌ వస్తుంది. కంటి పరీక్షలు చేయడం లేదని. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తమకు కూడా పథకాలు అమలవుతాయని సభకు హాజరైన మహిళలు తెలిపారు. స్థలికి చేరుకున్న కేసీఆర్‌ ఛత్రపతి శివాజీ, అంబేద్కడర్‌, పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశంలో మార్పులు తీసుకురావడానికే..నాందేడ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీర్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చాము. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చింది. దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదు. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి దేశ పరిస్థితులు మారలేదు. మహారాష్ట్రాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

మరఠ్వాడ గడ్డపై ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాన్ని మారుమోగించారు సీఎం కేసీఆర్‌. సభలో కేసీఆర్ మాట్లాడుతున్నా సమయంతో కొందరు ప్రజలు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. ‘దేశ జనాభాలో 42 శాతం రైతులే ఉన్నారు. రైతులు పండించిన పంటను వారే అమ్ముకోవాలి అప్పుడే రైతు రాజ్యం అవుతుంది. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు.. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. ఇలా అనుకున్న వారందరూ చతికిలపడిపోయారు అని ఉదాహరించారు. భారత దేశం పేద దేశం కాదు. భారత్‌ మేధావుల దేశం. భారత్‌ కంటే అమెరికా ఆర్థికవంతమైన దేశం. కనీ చిత్తశుద్దితో పని చేస్తే ఆ స్థాయికి ఎదగడం సాధ్యం అవుతుందని తెలిపారు. భారత్‌లో ఉన్నంత వ్యవసాయ భూమి ప్రపంచంలో మరెక్కడ లేదని గుర్తుచేశారు.

దేశంలో మేకిన్‌ ఇండియా నినాదం జోకిన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్‌ అన్నారు. ‘మాంజా నుంచి జాతీయ జెండాల వరకు అన్నీ చైనా నుంచి వస్తున్నవే అన్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్‌లు ఎందుకు వచ్చాయి..? చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి. 75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయి. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారు. ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ సమస్య. ‘తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవి. కానీ రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాము. రైతులు ఏ కారణంతో మరణించినా 4 రోజుల్లోగా రూ. 5 లక్షల చెక్‌ అందిస్తాము. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటున్నాము. రైతులు పండించిన పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణలో తీసుకొచ్చిన ఈ పథకాలు మహారాష్ట్రాలో ఎందుకు లేవు. దేశవ్యాప్తంగా ఎందుకు లేవు. ఒక్కసారి ఇంటి దగ్గరకు వెళ్లి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ కిసాన్‌ ప్రభుత్వం లేదు కాబట్టి. రైతు రాజ్యం వస్తేనే కరువు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.

రైతులకోసమే కాకుండా తెలంగాణలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వారు. వారికి కూడా 50శాతం సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. కులవృత్తులకు కూడా పెద్దపీట వేశామన్నారు. అభివృద్ది విషయానికొస్తే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం దళితబంధును ఏర్పాటు చేసి ప్రతి దళిత కుటుంబానికి 10లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామని చెప్పారు. నేనే దేశం మొత్తం తిరిగి ఈ రెండు పార్టీలతో పోరాడుతా మండల స్ధాయి పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నారన్నారు. అలాగే ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడని చెప్పుకొచ్చారు. రాబోయే జిల్లాపరిషత్ ఎన్నికల్లో రైతులు సత్తాచాటాలి అని పిలుపునిచ్చారు. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వమే మీ దగ్గరకు దిగి వస్తుందని సూచించారు. ఒకవేలుతో కొడితే దెబ్బ సరిగ్గా తగలదు. పిడికిలి బిగించిన దెబ్బ పడితే బలంగా తగులుతుందని అన్నారు.