PAWAN KALYAN: పవన్‌ని బూతులు తిట్టినోడికి టికెట్‌.. మహాసేన రాజేశ్‌పై జనసేన ఫైర్‌.. సేనానికి సూటి ప్రశ్నలు..

జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పి.గన్నవరం ఒకటి. అలాంటి నియోజకవర్గాన్ని హోల్డ్‌ చేసుకోవాల్సింది పోయి.. యూట్యూబర్‌ మహాసేన రాజేశ్‌కు ఇక్కడి నుంచి టికెట్ కేటాయించింది టీడీపీ. ఇదే జనసేన కార్యకర్తలకు మరింత కోపం తెప్పిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2024 | 04:39 PMLast Updated on: Feb 26, 2024 | 9:07 PM

Mahasena Rajesh Will Contest From P Gannavaram Janasena Fans Angry On Pawan Kalyan

PAWAN KALYAN: పొత్తులో భాగంగా 24 సీట్లకే పరిమితం కావడంపై.. జనసైనికులు భగ్గుమంటున్నారు. కొన్నిచోట్ల యువకులంతా వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి. 24 సీట్లు అయినా.. గెలిచేవి తీసుకున్నారా అంటే అదీ లేదు. జనసేన బలంగా ఉన్న స్థానాలను టీడీపీకి వదిలేసి.. ఆశలు లేని స్థానాలను పవన్ తీసుకున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో ఓట్ల లెక్క చూపిస్తూ మరీ.. పవన్‌ను, జనసేనను నిలదీస్తున్నారు మరికొందరు.

IND VS ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. 3-1తో సిరీస్ కైవసం..

మిగతా స్థానాల సంగతి ఎలా ఉన్నా.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం.. జనసైనికులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయగా.. ఇక్కడ గ్లాస్ పార్టీకి 36వేలకు పైగా ఓట్లు పడ్డాయ్. టీడీపీకి 45వేలకు పైగా ఓట్లు వచ్చాయ్. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పి.గన్నవరం ఒకటి. అలాంటి నియోజకవర్గాన్ని హోల్డ్‌ చేసుకోవాల్సింది పోయి.. టీడీపీకి అప్పగించడం.. పవన్ బలహీనతలను మరోసారి బయటపెట్టినట్లు అయిందనే చర్చ జరుగుతోంది. పోనీ టీడీపీ నుంచి సీనియర్‌ నేతకో.. బలమైన నాయకుడికో టికెట్ ఇస్తున్నారా అంటే.. యూట్యూబర్‌ మహాసేన రాజేశ్‌కు ఇక్కడి నుంచి టికెట్ కేటాయించింది టీడీపీ. ఇదే జనసేన కార్యకర్తలకు మరింత కోపం తెప్పిస్తోంది. మహాసేన రాజేశ్‌కు కాకుండా.. మరెవరికి టికెట్ ఇచ్చినా ఇంత బాధ పడేవాళ్లం కాదని.. అతన్ని ఓడించి తీరుతామని.. జనసైనికులు బహిరంగంగానే చెప్తున్నారు.

నిజానికి యూట్యూబ్‌ చానెల్ వేదికగా పొలిటికల్‌ అప్డేట్స్‌పై తన మార్క్ ఎనాలలిస్ ఇచ్చే మహాసేన రాజేశ్‌.. ఆ మధ్య పవన్‌ను, జనసేనను ఓ ఆట ఆడుకున్నారు. మాటలు హద్దులు దాటి బూతుల వరకు వెళ్లాయ్‌. చెప్పలేని విధంగా బూతులు తిట్టిన రాజేష్‌కు.. జనసేనకు గట్టి బలం ఉన్న పి. గన్నవరం కేటాయిస్తుంటే ఎలా ఒప్పుకొన్నావ్ అన్నయ్యా.. అంటూ జనపైనికులు ఏకంగా పవన్‌నే ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు రాజేశ్‌.. హిందూ మత వ్యతిరేకి, కాపు కుల వ్యతిరేకి అని.. అతన్ని ఓడించి తీరుతామంటూ బీజేపీ, జనసేన యాక్టివిస్టులు, బ్రాహ్మణ, కాపు కులస్తులు బహిరంగంగానే పోస్ట్‌లు పెడుతున్నారు.