మహారాష్ట్రలో మహాయుతి దూకుడు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డియే దూసుకుపోతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మహాయుతి హవా కొనసాగుతోంది. 220 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్ర లో సొంతగా 128 స్థానాల్లో బిజెపి ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డియే దూసుకుపోతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మహాయుతి హవా కొనసాగుతోంది. 220 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్ర లో సొంతగా 128 స్థానాల్లో బిజెపి ఉంది. మహాయుతి కూటమిలో భాగంగా 149 స్థానాల్లో పోటీ చేసింది బిజెపి. 53 స్థానాల్లో ముందంజలో ఏక్ నాథ్ షిండే శివసేన ఉండగా… 36 స్థానాల్లో ముందంజలో అజిత్ పవార్ ఎన్సీపీ ఉంది.
19 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఉండగా 19 స్థానాల్లో ముందంజలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే నిలబడింది. 13 స్థానాల్లో ముందంజలో శరద్ పవార్ ఎన్సీపీ ఉంది. ఇక వాయనాడ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు అయింది. వయనాడ్ లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ వాద్రా… మూడు లక్షల ఓట్ల మెజారిటీ దిశగా వెళ్తున్నారు. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరీ నిలిచారు. మూడో స్థానానికి బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ పరిమితం అయ్యారు.