MALLAREDDY: మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ ! ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వాలని కండిషన్

మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో గట్టిగానే టచ్‌లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా అయిన మల్లారెడ్డి.. తన కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నానని సిగ్నల్స్‌ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 01:23 PMLast Updated on: Feb 21, 2024 | 1:23 PM

Mallareddy Wants To Join Bjp Quit Brs But Here Is The Conditions

MALLAREDDY: మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతున్నట్టు టాక్ నడుస్తోంది. మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ తన కొడుక్కి ఇవ్వకపోతే కమలం పార్టీలోకి వెళ్తానని చెబుతున్నారట. ఇప్పటికే మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మిగిలిన 5 నియోజకవర్గాల్లోనూ తనకు పట్టు ఉందంటున్నారు మల్లారెడ్డి. ఖర్చు ఎంతైనా పెట్టుకోడానికి రెడీగా ఉన్నారు. BRS కాదంటే బీజేపీలోకి వెళ్ళడానికి మాజీ మంత్రి రెడీగా ఉన్నా.. ఆయన పెట్టిన షరతులు విని కమలం పెద్దలు షాక్ అవుతున్నారు. ఏంటా కండిషన్స్..?

ALLA RAMAKRISHNA REDDY: బౌన్స్ బ్యాక్.. ఆర్కే వెనక్కి ఎందుకు వచ్చాడో తెలుసా..?

తెలంగాణలో ఈసారి డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటాలని పార్టీ అగ్ర నాయకులు ప్లాన్‌ చేస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఆ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో కూడా తెలంగాణ అభ్యర్థుల విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో అంతర్గతంగా, రాష్ట్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లోనూ ఇప్పటికే అభ్యర్థులపై చర్చ జరిగిందట. ఆ టైంలోనే కొన్ని స్థానాలకు కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని, ఆ పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుని కొందరితో మాటలు కూడా మొదలైనట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో గట్టిగానే టచ్‌లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

Virat Kohli: మరోసారి తండ్రైన కోహ్లీ.. కొడుకు పేరేంటో తెలుసా..

సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా అయిన మల్లారెడ్డి.. తన కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నానని సిగ్నల్స్‌ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తనతో పాటు ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని బంపరాఫర్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన అడుగుతున్న మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్‌ కోసం ఇప్పటికే కమలం పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. పార్టీకి చెందిన బడా నేతలు ఆ సీటుపై కన్నేశారు. కానీ.. హై కమాండ్ నుంచి ఎలాంటి కమిట్‌మెంట్‌ రాలేదు. ఈ పరిస్థితుల్లో తన వారసుడి కోసం గోడ దూకి వచ్చేస్తానని మల్లారెడ్డి ఆఫర్‌ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఆ ఎంపీ టిక్కెట్‌ అయితే తమకు భద్రంగా ఉంటుందని భావిస్తున్నారట మల్లన్న. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తులపై కూడా ఇటీవలే ఓపెన్‌గా కామెంట్‌ చేశారు మాజీమంత్రి. అయితే మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటు పరిధిలోని మిగతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, ఆయనకు సఖ్యత ఉండదన్నది లోకల్‌ టాక్‌. కాషాయ దళం ఎంపీ టిక్కెట్‌ ఓకే చేస్తే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ సీట్లో తన కొడుకు లేదా కోడల్ని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట మాజీ మంత్రి. కానీ.. బీజేపీ మాత్రం ఆయనకు మింగుడు పడని ఓ షరతు పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆయనగానీ.. తనతోపాటు వస్తారని చెబుతున్న ఇద్దరుగానీ.. ఎవరైనా సరే.. రాజీనామా చేసి వస్తే.. ఎనీటైమ్‌ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పడమే మల్లారెడ్డికి మింగుడు పడటంలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ముందు దూకుడుగా ఉన్నా.. షరతుల గురించి విన్నాక ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో టైం గడిచేకొద్దీ పరిణామాలు ఇంకెంత ఆసక్తిగా మారతాయో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. తన ఎమ్మెల్యే పదవా? లేక కొడుకు రాజకీయ భవిష్యత్తా అన్న సంగతి మాజీ మంత్రి తేల్చుకోవాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. మొత్తంగా పార్టీ మారతానని మల్లారెడ్డి ఎక్కడా పైకి చెప్పకున్నా.. లోలోపల జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగిపోతున్నాయన్నది రెండు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. మరి చివరికి మల్లారెడ్డి కారులోనే కూల్‌ కూల్‌ అనుకుంటారా? లేక కాషాయం కప్పుకుంటారా అన్నది తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.