Mallu Bhatti Vikramarka: సినిమా రేంజ్‌లో భట్టి లవ్‌స్టోరీ.. ప్రేమకథలో ఇన్ని ట్విస్ట్‌లా..
ఆయనది లవ్ మ్యారేజ్ అవడమే ఒక షాకింగ్ అంటే.. ఆ కథలో ఉన్న ట్విస్ట్‌లు మరో షాక్‌లా.. సినిమా స్టోరీలను గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని లక్ష్మీపల్లిలో పుట్టిన భట్టి.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
Mallu Bhatti Vikramarka: జనరల్‌గా పొలిటీషియన్స్ అంటేనే అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఎప్పుడూ కార్యకర్తలు, మీటింగ్‌లు, గొడవలు ఇవే వాళ్ల జీవితాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ల లైఫ్‌లో కూడా మంచి మంచి లవ్‌స్టోరీస్ ఉంటాయి. కొందరి లవ్‌స్టోరీస్ ఐతే సినిమా స్టోరీలను గుర్తు చేస్తుంటాయి. అలాంటి స్టోరీల్లో ఒకటే తెలంగాణ డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కది కూడా. ఎప్పుడు గంభీరంగా కనిపిస్తూ చాలా డిగ్నిఫైడ్‌గా పాలిటిక్స్ చేసే భట్టిది కూడా లవ్ మ్యారేజ్ అని చాలా తక్కువ మందికి తెలుసు.
Chandrababu Naidu: యాగం.. రాజయోగం.. సీఎం కుర్చీ బాబుదేనా..? ఆ యాగం చేస్తే గ్యారంటీయా
ఆయనది లవ్ మ్యారేజ్ అవడమే ఒక షాకింగ్ అంటే.. ఆ కథలో ఉన్న ట్విస్ట్‌లు మరో షాక్‌లా.. సినిమా స్టోరీలను గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని లక్ష్మీపల్లిలో పుట్టిన భట్టి.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన అన్న మల్లు అనంత రాములు వాళ్ల కుటుంబంలో మొదటి రాజకీయ నాయకుడు. ఆయన ఇన్స్‌పిరేషన్‌తోనే భట్టి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియాలో చదువుకుంటున్న టైంలో ఎస్‌ఎస్‌యూఐ అనే స్టూడెంట్ వింగ్‌లో భట్టి విక్రమార్క స్టూడెంట్ లీడర్‌గా ఉండేవారు. ఆ సమయంలో భట్టి.. తన భార్య నందినిని కలుసుకున్నారట. నందిని గుజరాత్‌కు చెందిన అమ్మాయి. చాలా కాలం క్రితమే నందిని వాళ్ల కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. నందినికి కూడా భట్టి లాంటి విప్లవ భావాలే ఉండటంతో.. ఓయూ క్యాంపస్‌లో చాలా తొందరగా వాళ్లు ఫ్రెండ్స్ అయ్యారట. అలా మొదలైన ఫ్రెండ్‌షిప్ కొన్ని రోజులకు లవ్‌గా మారింది. భట్టి వ్యక్తిత్వం బాగా నచ్చి.. నందినే మొదట భట్టికి ప్రపోజ్ చేశారట. తన భావాలకు సరిగ్గా సెట్ అయ్యే అమ్మాయి అవడంతో భట్టి కూడా ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేశారట. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయం పెద్దలకు చెప్పారట.
కానీ వాళ్లు మాత్రం భట్టిని ఒప్పుకోలేదు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి తమ కూతురిని ఇవ్వమంటూ చెప్పేశారట. కానీ నందిని, భట్టి మాత్రం బతికితే కలిసే బతుకుతామంటూ పెద్దలకు చెప్పేశారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత వాళ్ల ప్రేమకు ఫిదా ఐపోయి.. ఇద్దరు కుంటుంబాల పెద్దలు కలిసి వాళ్లిద్దరికీ పెళ్ల ఇచేశారట. అప్పటి నుంచి భార్యగానే కాకుండా రాజకీయంలో కూడా నందిని భట్టికి ఓ బ్యాక్‌బోన్‌లా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రతీ ఎన్నికలో నందిని కీ రోల్ ప్లే చేస్తారు. భర్త తరఫున అన్ని ప్రాంతాల్లో ప్రచారం కూడా చేస్తారు. ప్రస్తుతం నందిని కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అప్లికేషన్ కూడా. అయితే పార్టీ ఆమెకు టికెట్ ఇస్తుందా లేదా చూడాలి. రాజకీయం సంగతి పక్కన పెడితే.. ఇలా ఓ చిన్న పాటి సినిమా రేంజ్ లవ్‌స్టోరీ నడిపి.. ప్రేమించిన అమ్మాయినే భార్యగా చేసుకున్నారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క.