Mamata Banerjee : దేశ సార్వత్రిక ఎన్నికల వేళ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు.. నా మద్దతు ఆ పార్టీకే
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దఫాల వారిగా ముగుస్తున్నాయి. తాజాగా ఏపీతో సహ నాలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మరో మిగిలిన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దఫాల వారిగా ముగుస్తున్నాయి. తాజాగా ఏపీతో సహ నాలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మరో మిగిలిన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఈ ఎన్నికల వేళ టీఎంసీ పార్టీ అధినేత వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ఏర్పడితే నేను మద్దతిస్తానని మమతా స్పష్టం చేసింది.
ఆ మధ్య సీట్లపంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీతో తలెత్తిన విభేదాల కారణంగా దీదీ ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పటి నుంచి ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇండియా కూటమి ఏర్పడితే బయటి నుంచి తమ మద్దతు తెలుపుతామని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల జాబ్ స్కీమ్ పని చేసేవారు ఇబ్బంది పడకుండా కూటమికి మద్దతు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ ఇండియా కూటమికి మద్దతు ఉంటుందని చెప్పడంతో టీఎంసీ ఇంకా కూటమిలోనే ఉందని తేలిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ 400 వందల సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోందని.. కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేరని విమర్శించారు.
Suresh SSM