మా అమ్మ హాస్పిటల్ లో లేదు: మనోజ్ సంచలనం
నాకు న్యాయం జరుగుతుందని పోలీస్ వ్యవస్థ పై నమ్మకం ఉందని మంచు మనోజ్ వ్యాఖ్యానించాడు. నేరేడ్మెట్ సిపి ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడిన మనోజ్... పోలీస్ వారు నాకు హామీ ఇచ్చారని... మేము అందరం సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని స్పష్టం చేసాడు.
నాకు న్యాయం జరుగుతుందని పోలీస్ వ్యవస్థ పై నమ్మకం ఉందని మంచు మనోజ్ వ్యాఖ్యానించాడు. నేరేడ్మెట్ సిపి ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడిన మనోజ్… పోలీస్ వారు నాకు హామీ ఇచ్చారని… మేము అందరం సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని స్పష్టం చేసాడు. ఎక్కువగా మా ఇంటివద్ద పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదని పోలిసులు సూచించారన్నాడు. సమస్య పరిష్కారం అయితే అందరికీ సంతోషమన్నాడు. మా అన్న విష్ణు ప్రోద్భలంతో ఇదంతా జరుగుతుందని మండిపడ్డాడు.
మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి అది అవాస్తవమని స్పష్టం చేసాడు. చంద్రగిరి పేద ప్రజల కోసం నేను పోరాడుతున్న అన్నాడు. వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడని నేను మా నాన్నగారికి చెబుతున్న పట్టించుకోవడం లేదన్నాడు. నాన్నగారికి ఇవన్నీ విషయాలు తెలియదని వ్యాఖ్యలు చేసాడు. నేను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులని పట్టుకున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నాడు.