మోహన్ బాబు కాలేజి వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది.. మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది ముందే హెచ్చరించారు. కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు.. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు వెళ్ళాడు మనోజ్. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లె చేరుకొని చంద్రబాబు కుటుంబాన్ని కలిసాడు మనోజ్. [embed]https://www.youtube.com/watch?v=wa8F04OJI1g&pp=ygUJZGlhbCBuZXdz[/embed]