నందమూరి ఇంటికి మంచు పంచాయితీ, బాలయ్యకు విష్ణు ఫోన్
గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్న మంచు మోహన్ బాబు కుటుంబ ఆస్తులు వ్యవహారం ఎప్పుడూ నందమూరి బాలకృష్ణ ఇంటికి చేరుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఆస్తులు వ్యవహారానికి సంబంధించి మంచు మనోజ్ పెద్ద పోరాటం చేస్తున్నాడు.
గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్న మంచు మోహన్ బాబు కుటుంబ ఆస్తులు వ్యవహారం ఎప్పుడూ నందమూరి బాలకృష్ణ ఇంటికి చేరుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఆస్తులు వ్యవహారానికి సంబంధించి మంచు మనోజ్ పెద్ద పోరాటం చేస్తున్నాడు. ఇక ఈ పోరాటం మంగళవారం సాయంత్రం తీవ్రస్థాయిలో కనబడింది. మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లడం, ఆ తర్వాత అతనిపై దాడి చేయడం అలాగే మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై స్వయంగా మోహన్ బాబు మైక్ తీసుకుని దాడి చేయడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇక ఈ వివాదానికి త్వరలోనే ముగింపు పలకాలని మోహన్ బాబు కూడా భావిస్తున్నారు. అటు మంచు విష్ణు కూడా ఈ వివాదాన్ని త్వరగా ముగించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరిపే ప్రయత్నం చేసిన మంచు మనోజ్ అలాగే తన భార్య మౌనిక ఇద్దరూ బయటికి వచ్చేసారు. దీనితో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి సినిమా పరిశ్రమంలో తనకు సన్నిహితంగా ఉండే నందమూరి బాలకృష్ణ ద్వారా వివాదానికి ముగింపు పలకాలని మంచు విష్ణు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో నందమూరి బాలకృష్ణ… మంచు విష్ణుకు సహకరించారు.
ఆ సమయంలో విష్ణు గెలుపు కోసం ఆయన పనిచేశారు. దీనితో ఇప్పుడు బాలకృష్ణ ఇంటికి వెళ్లి మనోజ్ తో మాట్లాడవలసిందిగా కోరే అవకాశం కనబడుతోంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే బాలకృష్ణతో విష్ణు ఫోన్లో కూడా మాట్లాడి పరిస్థితి వివరించినట్లుగా సమాచారం. దీనితో తన ఇంటికి రావాల్సిందిగా బాలకృష్ణ… విష్ణుని ఆహ్వానించారట. మంచు లక్ష్మి కూడా వెళ్లే అవకాశం ఉందని, అలాగే కుదిరితే మోహన్ బాబు కూడా బాలకృష్ణ నివాసానికి వెళ్లే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. సినిమా పరిశ్రమంలో నందమూరి కుటుంబంతో మోహన్ బాబు కుటుంబం సన్నిహితంగానే మెలుగుతోంది. అందుకే ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ కూడా బాలకృష్ణ మోహన్ బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. ఇప్పుడు ఆస్తులు వివాద పరిష్కారానికి కూడా మోహన్ బాబు, మంచు విష్ణు… బాలకృష్ణ నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. మంచు మనోజ్ తో, భూమా కుటుంబంతో మాట్లాడవలసిందిగా అలాగే ఈ విషయంలో తమకు సహాయం చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేసే అవకాశం కనబడుతోంది. ఈ సందర్భంగా భూమా కుటుంబంపై కూడా ఫిర్యాదు చేయవచ్చు అని తెలుస్తోంది. భూమా మౌనిక కారణంగానే తమ కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయని విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లాలని మోహన్ బాబు భావిస్తున్నారట.