పవన్ నీ శాఖను అనితకు ఇస్తే ఓకే నా: మందకృష్ణ ఫైర్
ఏపీ హోం మంత్రిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. పవన్ మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలి అని సూచించారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు.

ఏపీ హోం మంత్రిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. పవన్ మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలి అని సూచించారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. హోంమంత్రి ని అంటే ప్రభుత్వాన్ని అన్నట్లే.. అంటే సీఎం ను అన్నట్టే అన్నారు. హోంమంత్రి ని అనడమే కాదు.. సీఎం ను కూడా పవన్ అన్నట్టే అని మండిపడ్డారు.
ఎస్సి, ఎస్టి, బిసి లకు మంత్రి ఇవ్వనపుడు ఇదేం సామాజిక న్యాయం అని నిలదీశారు. మాట్లాడే సమయం వచ్చినపుడు మేం అన్ని విషయాలు మాట్లాడతామన్న ఆయన కేబినెట్ అంటే కుటుంబమన్నారు. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపు పవన్ మాటలు ఆయన శాఖ కు కూడా వర్తిస్తాయన్నారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరమన్నారు.
ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల మేము మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. జనసేన అందరిపార్టీనా కాదా .. కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో.. మాకు కాదన్నారు మందకృష్ణ. జనసేనకు కేటాయించిన బిసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో సీటు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలాగా వుంటుందని ఆయన ప్రశ్నించారు.