బ్రేకింగ్: సజ్జల అరెస్ట్…?
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించిన పోలీసులు… వారు సజ్జల పేరు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేసారు.
రేపు ఉదయం 10 గంటల నుంచి.. సాయంత్రం నాలుగు గంటల లోపు మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే దీనిపై సజ్జల ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేసారు. ఇక ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.