ఏపీ లిక్కర్ క్వీన్స్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో భాగంగా లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించే ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో కాస్త వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మద్యం షాపులను దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో భాగంగా లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించే ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో కాస్త వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇక లిక్కర్ షాప్ ల లాటరీ విజేతలలో పలువురు మహిళలు కూడా ఉండటం చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన షాప్ లలో 10.2 % మహిళలకు లిక్కర్ లైసెన్స్ లు కేటాయించారు. మొత్తం 3396 షాప్ లలో 345 షాప్స్ ను దక్కించుకున్నారు మహిళలు. అత్యధికంగా విశాఖ లో 155 షాప్స్ లో 31 షాప్స్ లో మహిళల కే అదృష్టం వరించింది. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 117 షాప్స్ లో ఒక మహిళకు లాటరీ లో మద్యం దుకాణం కేటాయించారు.