పవన్ నిన్ను వదలను: మార్గాని స్ట్రాంగ్ వార్నింగ్
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు భరత్. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు.
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు భరత్. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. జంతువులని పట్టుకుని సెల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం జరిగిందని కనీసం తాగునీరు గాని అందించకుండా ఎందుకు బంధించినట్టు ఉంచారన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. టీటీడీ ఈవో, చైర్మన్ ల మధ్య సమన్వయ లోపం ఉందని ఇది దేవస్థానమో రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదన్నారు.
తిరుపతి ఘటనలో ఏడుగురు మృతి చెందారు అనేకమంది దెబ్బలు తిన్నారు అత్యంత బాధాకరమైన విషయమన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా అని నిలదీశారు. రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారన్నారు. తిరుపతి మరణాలకు బాధ్యత ఎవరిది …? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ తిరుపతి ఘటన బాధ్యత టీటీడీకి వదిలేసారని మండిపడ్డారు. క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయని టిటిడి చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు.