అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, భర్తతో మేరీకోమ్ విడాకులు
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్.. విడాకులు తీసుకుబోతున్నారన్న వార్తలు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నలుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది.

భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్.. విడాకులు తీసుకుబోతున్నారన్న వార్తలు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నలుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా వెల్లడిస్తోంది. సొంతరాష్ట్రం మణిపూర్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మేరీ భర్త ఓంక్లర్ ఓటమిపాలయ్యాడు. ఆ ఎన్నికల క్యాంపెయినింగ్ కోసం ఈ దంపతులు 3 కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ అనూహ్య ఓటమి ఎదురవడంతో మేరీకోమ్ తట్టుకోలేకపోయిందని, ఈ కారణంగానే భర్త నుంచి దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనని భర్త చెప్పినా కూడా మేరీనే బలవంతంగా పోటీ చేయించిందని కూడా తెలుస్తోంది.