బ్రేకింగ్: కర్రెగుట్టలో హిడ్మా దళం ములుగులో భారీ ఎన్కౌంటర్ ?
ములుగు జిల్లా వెంకటాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో మావోయిస్టు దళాలు ఉన్నట్టు సమాచారం రావడంతో వేల మంది పోలీసులు,

ములుగు జిల్లా వెంకటాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో మావోయిస్టు దళాలు ఉన్నట్టు సమాచారం రావడంతో వేల మంది పోలీసులు, CRPF బలగాలు కర్రెగుట్టును చుట్టుముట్టాయి. ఆలుబాక నుంచి కర్రెగుట్ట వైపు దాదాపు వెయ్యి మంది CRPF పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం కర్రెగుట్టను కంట్రోల్‌లోకి తీసుకునేందుకు వేల మంది పోలీసులు,CRPF బలగాలు ములుగుకు చేరుకున్నట్టు సమాచారం.
ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్‌లు ఎక్కువగా జరుగుతుండటంతో.. మావోయిస్టు దళాలు కర్రెగుట్టకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ల్యాండ్‌మైన్స్ ఏర్పాటు చేశామని.. అటువైపు ఎవరూ రావొద్దంటూ రీసెంట్‌గా మావోయిస్టులు స్థానికులను హెచ్చరించినట్టు సమాచారం. దీంతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేతలు ఇప్పుడు కర్రెగుట్టలోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో వెంకటాపూర్ ప్రాంతం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.