బ్రేకింగ్: వేట మొదలు, కశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 11:00 AMLast Updated on: Apr 24, 2025 | 1:33 PM

Massive Encounter In Kashmir

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బేస్‌ క్యాంపుల నుంచి అక్కడకు భారీగా అదనపు బలగాలు చేరుకుంటున్నాయి.

పహల్గాం ఎటాక్‌కు సూత్రధారి అయిన ఆసిఫ్‌ను భద్రతా బలగాలు ట్రాప్‌ చేసినట్టు తెలుస్తోంది. పహల్గాం ఎటాక్‌లో ఆసిఫ్‌ స్వయంగా పాల్గొన్నాడు. ఆసిఫ్‌తో పాటు అతని బలగాలను కూడా ఇండియన్‌ ఆర్మీ ఎటాక్‌ చేసినట్టు సమాచారం.