మాస్టర్ మైండ్ స్నేహా రెడ్డి, బన్నీ కొంగుచాటు మొగుడా…?

మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది. అల్లు అర్జున్ ను మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్, నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం పట్ల జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 06:51 PMLast Updated on: Dec 05, 2024 | 6:51 PM

Mastermind Sneha Reddy Will Guide Allu Arjun

మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది. అల్లు అర్జున్ ను మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్, నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం పట్ల జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. ఇక వైసిపి సోషల్ మీడియా అల్లు అర్జున్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పుష్ప సినిమా ప్రమోషన్ చేస్తోంది. ఇక మెగా ఫ్యామిలీని పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ పూర్తిగా పక్కన పెట్టేసాడు.

హైదరాబాదులో నిర్వహించిన మెగా ఫ్యామిలీ నుంచి కచ్చితంగా చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని లేదంటే రామ్ చరణ్ ను ఆహ్వానించే అవకాశం ఉండవచ్చు అంటూ ప్రచారం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎవరిని ఆహ్వానించలేదు. అయితే దీని వెనక అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి మాస్టర్ మైండ్ అంటూ ఇప్పుడు పలువురు సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్పా పార్ట్ 2 తో అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ వస్తుంది నేషనల్ లెవెల్ లో.

అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా గుర్తించే సినిమా ఇది. రాజమౌళి సినిమా లేకుండా తెలుగు నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఏకైక హీరో అల్లు అర్జున్. అయితే పుష్ప సినిమా విషయంలో మెగా ఫ్యామిలీని కనుక అల్లు అర్జున్ ప్రమోషన్స్ కు లేదంటే వేరే ఏ ఇతర కార్యక్రమాలకైనా వాడుకుని ఉంటే కచ్చితంగా పుష్ప సినిమా క్రెడిట్ మెగా ఫ్యామిలీకి వెళ్లి ఉండేది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ తమ సక్సెస్ ను మెగా ఫ్యామిలీ సక్సెస్ గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది స్నేహ రెడ్డి ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఆమె చాలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్లినట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ 5 ఏళ్లపాటు కష్టపడ్డాడు. ఇక చివరిలో వచ్చి మెగా ఫ్యామిలీ ప్రమోషన్ చేస్తే ఖచ్చితంగా క్రెడిట్ ను చిరంజీవి లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే ఇతర హీరోలు తీసుకునే అవకాశం ఉండవచ్చు. అందుకే అసలు పుష్ప సినిమా ప్రమోషన్ విషయంలో అల్లు అర్జున్ ఎవరి మీద డిపెండ్ కాలేదని అందుకే అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి ఫోటో గానీ ఎవరి సోషల్ మీడియా పోస్ట్ గాని ఆయన వాడుకోలేదు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

పుష్ప పార్ట్ వన్ విషయంలో అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ గా ఇమేజ్ వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు కూడా ఈ సినిమా కోసం ప్రమోషన్ చేశారు. మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి ఇప్పటివరకు ఆ రేంజ్ లో ప్రమోషన్ జరగలేదు. అసలు మెగా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే కాదు ఇండియాలో ఏ హీరోకి కూడా ఈ రేంజ్ లో క్రికెటర్లు ప్రమోషన్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు పుష్ప 2 కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని… మెగా ఫ్యామిలీ ఏ మాత్రం సపోర్ట్ చేసిన సరే కచ్చితంగా క్రెడిట్ మొత్తం వాళ్లే తీసుకుంటారని స్నేహ రెడ్డి ఈ విషయంలో దూరంగా ఉంచారట. మేటర్ బన్నీకి వివరించి… ప్లాన్ ను పక్కాగా వర్కౌట్ చేసారు స్నేహా రెడ్డి.