భూకంపానికి వణికిన మేడారం ఆలయం – సమ్మక్క సారలమ్మలు ఆగ్రహించారా..?
తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. మేడారం ఆలయం కూడా... భూప్రకంపనలకు వణికింది. ములుగు కేంద్రంగా భూకంపం రావడానికి కారణం ఏంటి..? సమక్క సారలమ్మ సాక్షిగా... అసలు ఏం జరిగింది..?
తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. మేడారం ఆలయం కూడా… భూప్రకంపనలకు వణికింది. ములుగు కేంద్రంగా భూకంపం రావడానికి కారణం ఏంటి..? సమక్క సారలమ్మ సాక్షిగా… అసలు ఏం జరిగింది..?
మేడారం భయం గుప్పెట్లో ఉంది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం రావడం… అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు… భూప్రకంపనలు మొదలయ్యాయి. భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. ఎప్పుడు ఏం జరుగుతోంది… మళ్లీ భూకంపం వస్తుందేమో అన్న భయంతో… ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. మేడారం ఆలయంలో కూడా కంపించింది. భూప్రకంపనలకు… మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దె వణికింది. అమ్మవార్ల ఆగ్రహం వల్లే ఇలా జరిగిందని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. అది నిజమేనా..? స్థానికుల్లో అలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి..?
ములుగు జిల్లాను వరుస ప్రకృతి వైపరీత్యాలు భయపెడుతున్నాయి. వరదలు ముంచెత్తి పలు ఊర్లకు రాకపోకలు తెగిపోయాయి. దీని వల్ల చాలా రోజులు ఇబ్బందుల పడ్డారు అక్కడి ప్రజలు. ఈమధ్యనే ములుగు జిల్లాలోని అటవీప్రాంతంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుడిగాలి విరుచుకు పడిందా అన్నట్టు… కనిపించింది. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న వేలాది చెట్లు నేలకొరిగాయి. కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి దగ్గరలో ఉన్న ఆటవీప్రాంతంలోనే… ఈ ప్రకృతి విలయం జరిగింది. వేలాది చెట్లు నేలకూలడానికి అసలు కారణం ఏంటో… ఇప్పటికీ స్పష్టత లేదు. అతివేగంగా గాలులు వీయడమే కారణం అంటున్నారు అధికారులు. అయితే… ఆ ప్రాంతంలో మాత్రమే గాలులు ఎలా వీచాయి. చెట్లు కూలిపోయిన తర్వాత గానీ… అంతటి విలయం వచ్చిందని ఎవరికీ తెలియలేదు. అంటే… అసలు ఏం జరిగింది…? అధికారులు ఎన్నో కారణాలు చెప్పినా…. ఇది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఆ రహస్యం వీడకముందే… ఇప్పుడు భూకంపం. అది కూడా ములుగు జిల్లా మేడారం కేంద్రంగానే వచ్చింది. దీంతో… మేడారం ప్రజలకు భయం మరింత పెరిగింది.
తెలంగాణలో 20ఏళ్ల తర్వాత భూకంపం వచ్చింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ భూప్రకంపనలు… మేడారం ఆలయాన్ని కూడా తాకాయి. ఆలయంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె కూడా కంపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మేడారం కేంద్రంగా భూకంపం రావడం… ఆలయంలోని అమ్మవార్ల గద్దె కూడా కంపించడంతో… ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆగ్రహం వల్లే… ప్రకృతి విలయాలు సంభవిస్తున్నాయని భయపడిపోతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఏమో తెలీదు గానీ…? అమ్మవార్లు ఆగ్రహించారని అక్కడి ప్రజలు మాత్రం వణిపోతున్నారు.