పవనన్న రుణపడి ఉంటాం, ఉద్యోగులకు పవన్ గుడ్ న్యూస్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే స్పందించి పరిష్కరించారంటూ ఆనందం వ్యక్తం చేసారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే స్పందించి పరిష్కరించారంటూ ఆనందం వ్యక్తం చేసారు. అనంతరం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ… ‘ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరామన్నారు. విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నామని పేర్కొన్నారు.
మేము పని చేసిన కాలానికి జీతాలు ఇప్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పవన్ కళ్యాణ్ ను కలిసి విన్నవించామన్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పవన్ పరిష్కరించారని పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల అయ్యాయని… రెండేళ్లుగా ఉన్న సమస్యను నెల రోజుల్లో పరిష్కరించిన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని కొనియాడారు.