2024 మెగా ఫ్యామిలీకి కచ్చితంగా స్పెషల్ ఇయర్ గానే చెప్పాలి. మెగా ఫ్యామిలీలో ఒక్క అల్లు అర్జున్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ చాలా స్పెషల్ అనేది అర్థమవుతుంది. అల్లుఅర్జున్ జైలుకు వెళ్లడం ఒకటి పక్కన పెట్టి చూస్తే చిరంజీవికి పద్మ విభూషణ్ నుంచి జనసేన పార్టీ ఎన్నికల్లో గెలవడం వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమే. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణం పురస్కారం ప్రకటించింది. అలాగే పలు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా ఆయనకు దక్కాయి. అనేక డాన్స్ స్టెప్పులు వేసిన హీరోగా చిరంజీవి నిలిచారు. దీనితో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసి 11 స్థానాల్లో గెలిస్తే అంతకుమించి జనసేన పార్టీ విజయం సాధించింది. పవన్ ను అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నిసార్లు టార్గెట్ చేసిన పవన్ మాత్రం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టారు. ఇక ఏపీ ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రాధాన్యత దక్కుతోంది. పవన్ కళ్యాణ్... తో పాటుగా త్వరలోనే నాగబాబు కూడా క్యాబినెట్ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఖరారు చేశారు. మార్చిలో నాగబాబు క్యాబినెట్ లోకి అడుగుపెడుతున్నట్లు సోమవారం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి రాంచరణ్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మెగా ఫ్యామిలీకి కచ్చితంగా ఈ ఏడాది బాగా కలిసి వచ్చిన సంవత్సరం గానే చెప్పాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అప్పుడు ఘోర ఓటమి చెందినా... పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం మెగా ఫ్యామిలీ అభిమానులను ఆనందంలో ముంచేత్తుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ఆ తర్వాత ఆయనకు కేంద్రంలో కూడా ప్రాధాన్యత పెరగడం వంటివి జరిగాయి. అయితే 2024లో అల్లు అర్జున్ పుష్ప సినిమా కారణంగా కాస్త ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మంచి విభేదాలు ఉన్నాయని వార్తలు రావటమే గాని ఎప్పుడూ కన్ఫామ్ కాలేదు. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం కాస్త సెన్సేషన్ అయింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం మాత్రం కచ్చితంగా స్పెషల్ ఇయర్ గానే చెప్పాలి.[embed]https://www.youtube.com/watch?v=UQN0diqY6fI[/embed]