MEGASTAR CHIRANJEEVI: కూటమికి మెగాస్టార్ మద్దతు.. చిరు పరువు తీసుకుంటున్నారా..?
టికెట్ల పెంపు రచ్చ టైమ్‌లో జగన్, చిరు మధ్య జరిగిన పరిణామాలను.. ఇప్పుడు బయటకి తీసుకున్నారు సేనాని. ఇలాంటి పరిణామాల మధ్య.. సీఎం రమేష్‌కు చిరు సపోర్ట్ చేయడం అంటే.. అది కూటమికి సపోర్ట్ చేసినట్లే అనే డిస్కషన్ మొదలైంది. దీనిపై ఇప్పుడు వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
MEGASTAR CHIRANJEEVI: ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయ్. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. చిరును కలిసి మెగాశీస్సులు తీసుకున్నారు. ఇక అదే సమయంలో మెగాస్టార్‌ను పవన్ ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. టికెట్ల పెంపు రచ్చ టైమ్‌లో జగన్, చిరు మధ్య జరిగిన పరిణామాలను.. ఇప్పుడు బయటకి తీసుకున్నారు సేనాని. ఇలాంటి పరిణామాల మధ్య.. సీఎం రమేష్‌కు చిరు సపోర్ట్ చేయడం అంటే.. అది కూటమికి సపోర్ట్ చేసినట్లే అనే డిస్కషన్ మొదలైంది.
Aishwarya Rai Bachchan : జస్ట్ సెల్ఫీ తో నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్..
దీనిపై ఇప్పుడు వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత చిరు.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ఏ పార్టీలో లేనని చిరు పదేపదే చెప్తున్నా.. కాంగ్రెస్ మాత్రం ఆయనను తమవాడే అని చెప్పుకుంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య.. కూటమికి మద్దతివ్వడం చిరును టార్గెట్ అయ్యేలా చేస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి.. ఇప్పుడో రాజకీయ నేతకు సపోర్ట్‌గా నిలవడం పరువు తీసుకోవడమే అవుతుందనే ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. తిట్టడం, తిట్టించుకోవడం చేతగాకే రాజకీయాలు వదిలేశానని చెప్పి.. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఏంటి అంటూ వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇదే అదనుగా మెగాస్టార్ మీదకు ప్రశ్నలు సంధిస్తోంది. ప్రజారాజ్యం పార్టీని ఎందుకు విలీనం చేశారు.
జనాలు ఇప్పుడే గుర్తొచ్చారా.. ఈ పదేళ్లలో జనాల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు. అమరావతి, విశాఖ స్టీల్, విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేదు. సమాజానికి మంచి జరుగుతుందనే.. సీఎం రమేష్‌కు సపోర్ట్ చేస్తున్నానని చెప్తన్న చిరు.. సమాజంలో జరిగిన ఈ పరిణామాలపై ఎందుకు రియాక్ట్ కాలేదు అని వైసీపీ నిలదీస్తోంది. మరి కూటమి తరఫున డైరెక్ట్ ప్రచారానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. చిరు వీటికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది.