మెగాస్టార్ చిరంజీవికి తత్వం బోధపడిందా ? రాజకీయాలకు పనికిరానని తెలుసుకున్నారా ?
చిరంజీవి...సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్. ఎవరి సపోర్ట్ లేకుండా టాప్ స్టార్ అయ్యాడు. రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ స్థాపించారు.

చిరంజీవి…సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్. ఎవరి సపోర్ట్ లేకుండా టాప్ స్టార్ అయ్యాడు. రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేశారు. 18 సీట్లు గెలుపొందారు. సీన్ కట్ చేస్తే…పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. రాజకీయాలకు పనికి రామని అనుకున్నారో… లేదంటో మనకెందుకు బురద అని ఆలోచించారో..తెలియదు. కానీ జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ మారాయి. ఎందుకిలా మాట్లాడారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి….తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్. నటనలో…డ్యాన్స్ లో…యాక్టింగ్ లో సూపర్ స్టార్. మానవత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. స్వయంకృషితో టాలీవుడ్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ఒకానొక దశలో బాలీవుడ్ నటుల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఇప్పటికీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో టాప్-10లో ఉన్నారు. ఆయన కాల్ షీట్స్ కోసం నిర్మాతలు వెంటపడ్డారు. ఎంతో మంది దర్శకులు డేట్స్ కోసం వెయిట్ చేశారు. ఆయన చేసిన సినిమా వస్తుందంటే…రికార్డులు బద్దలు కావాల్సిందే. ఆయన వేసే స్టెప్పులు, చేసే ఫైటింగ్ లు, యాక్టింగ్…అబ్బో ఎంత చెప్పినా తక్కువ. దటీజ్ చిరంజీవి.
సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. తిరుగులేని యాక్టర్ ఎదిగాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాల్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఉండగానే…రాజకీయాలపై మనసు మళ్లింది. ప్రోడ్యూసర్లు, దర్శకులు క్యూకడుతున్నా…పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా బరిలోకి దిగారు. 18 అసెంబ్లీ సీట్లతో సత్తా చాటారు. ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేయలేకపోయారు. ఐదేళ్లు పోరాటం చేసి ఉంటే…ముఖ్యమంత్రి అయ్యే వారేమో. ఓపిక పట్టలేకపోయారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. పదేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. పాలిటిక్స్ లో తాను చేసిన తప్పులేమిటో స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం ముగియక ముందే డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకూ వెళ్లలేదు. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్రలో రాజకీయ వేదికను పంచుకున్నారు. దీంతో మెగాస్టార్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారని…కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఒకసారి…లేదంటే తెలంగాణలో కీలక పదవి ఇస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చిరంజీవి ఎప్పుడూ టెంప్ట్ కాలేదు. అలాగని బీజేపీతో దగ్గరగా లేరు. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం కూడా లేదు. రాజకీయం అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందులోకి మళ్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. చూపించే చాన్స్ కూడా లేదని…తాజా కామెంట్స్ తో స్పష్టమైంది.
రాజకీయాల వైపు వచ్చే చాన్సే లేదని చిరంజీవి ప్రకటించారు. తాను పూర్తిగా సినిమాలపై పరిమితమవుతానని…తన ఆశయాలను సోదరుడు పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. తన జీవితంలోకి మరోసారి రాజకీయం రాబోదని స్పష్టం చేశారు. చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయన కు లక్షలాది మంది ప్యాన్స్ ఉన్నారు. చిరంజీవికి అత్యున్నత గౌరవం ఇవ్వడం ద్వారా ఆకట్టుకోవాలని రాజకీయ నేతల ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.