RAJASINGH: రాజాసింగ్‌కు ఎంఐఎం మద్దతా..? జూబ్లీహిల్స్‌లో అజార్‌పై పోటీతో రచ్చ..

గోషామహల్‌లో మొత్తం 2 లక్షల 82 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళల్లో 80 వేల మంది దాకా ముస్లిం ఓటర్లు. అంత మెజార్టీ ఉన్నా.. ఈ ఎన్నికల్లో MIM ఎందుకు తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యం అని చెప్పుకునే MIM.. గోషా మహల్ లో ఎందుకు వెనక్కి తగ్గింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 05:00 PMLast Updated on: Nov 16, 2023 | 5:00 PM

Mim Supporting Raja Singh In Goshamahal

RAJASINGH: గోషామహల్‌లో రాజాసింగ్‌కు MIM మద్దతు ఇస్తోందా..? అక్కడ భారీగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నా.. తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. పైగా జూబ్లీహిల్స్ లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజారుద్దీన్ పోటీ చేస్తుంటే.. అక్కడ ఎందుకు పోటీకి దిగింది. ఇప్పుడు MIM లీడర్లతో పాటు.. పాతబస్తీ ముస్లింలు ఇదే అంశంపై రగిలిపోతున్నారు. MIM తీరును తప్పబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా కూడా చేయడంతో ఈ ఇష్యూ అసదుద్దీన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్, MIM ఒక్కటే.. ఈ రెండూ కలసి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటూ గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గోషామహల్ లో MIM తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో.. కాంగ్రెస్ అనుమానాలకు బలం చేకూరుతోంది.

P Chidambaram: కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది: కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం

గోషామహల్‌లో మొత్తం 2 లక్షల 82 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళల్లో 80 వేల మంది దాకా ముస్లిం ఓటర్లు. అంత మెజార్టీ ఉన్నా.. ఈ ఎన్నికల్లో MIM ఎందుకు తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యం అని చెప్పుకునే MIM.. గోషా మహల్ లో ఎందుకు వెనక్కి తగ్గింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ పోటీలో ఉన్నారు. ఆయన కోసమే పోటీ చేయడం లేదని అంటున్నా.. ముస్లింలంతా ఆయనకు ఓటేస్తారన్న నమ్మకమైతే లేదు. MIM కి, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మాట్లాడే రాజా సింగ్ ను ఓడిస్తామని గతంలో ప్రకటించింది మజ్లిస్. గోషామహల్ నియోజకవర్గంలో 6 డివిజన్లలో రెండింటిలో మజ్లిస్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ రాజాసింగ్ పై పోటీకి MIM కార్పొరేటర్లు, మాజీలు, ఇతర లీడర్లు ముందుకొచ్చినా MIM టిక్కెట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇవ్వడానికే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ హైకమాండ్ చెప్పుకుంటోంది. ఇక జూబ్లీ హిల్స్ లో చూస్తే.. ఇక్కడ కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి మాగుంట గోపీనాథ్ ఉన్నా.. అజార్ ఓటమే లక్ష్యంగా MIM తమ అభ్యర్థిని నిలబెట్టింది. జూబ్లీ హిల్స్ లో లక్షా 20 వేలకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి.

గత రెండు సార్లు పోటీలో ఉన్న మజ్లిస్ .. స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయింది. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఉన్న ముస్లిం ఓట్లను చీల్చ… పరోక్షంగా BRS అభ్యర్థిని గెలిపించాలన్నది MIM లక్ష్యం. ఇదే అంశాన్ని MIM సీనియర్ లీడర్ అక్బరుద్దీన్ ను ప్రశ్నిస్తే.. మేం ఉత్తరప్రదేశ్ లో పోటీ చేశాం.. కానీ అక్కడ యోగీ ఆదిత్యానాథ్ గెలిచారు. ఇప్పుడు గోషామహల్ లో పోటీస్తే రాజాసింగ్ గెలుస్తారు. అందువల్ల మాకు ఉపయోగం ఏంటి.. కానీ RSS టిల్లు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో అజార్ ను ఎందుకు నిలబెట్టారు ? గోషా మహల్ లో ఎందుకు పోటీ చేయించలేదు అని ఎదురు ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వాదన ఎలా ఉన్నా.. గోషా మహల్ లో అభ్యర్థిని పెట్టకుండా.. అజారుద్దీన్ ను ఓడించడానికి ప్రయత్నించడం ఏంటని MIM పై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి.