కేటిఆర్ అరెస్ట్ పై మంత్రి సంచలన కామెంట్స్
మాజీ మంత్రి కేటిఆర్ అరెస్ట్ ఊహాగానాలపై మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. లగచర్లకు ఎవరు వచ్చిన దాడులు చేయాలని చెప్పింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని నిలదీశారు.

మాజీ మంత్రి కేటిఆర్ అరెస్ట్ ఊహాగానాలపై మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. లగచర్లకు ఎవరు వచ్చిన దాడులు చేయాలని చెప్పింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల పైన దాడులు చెయ్యమని చెప్పింది ఎవరో విడియోలో ఉన్నదన్నారు. కలెక్టర్, కడా ఛైర్మెన్ ను చంపే ప్రయత్నం చేశారని సంచలన వ్యాఖ్యలు చ్చేసారు.
పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతీలో ఒక చిహ్నమన్నారు. అందుకు ఆయా ప్రాంత ప్రజలను మెప్పించి మాట్లాడతామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అధికారుల పైన దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బిఆర్ఎస్ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని… పదే పదే అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే అన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని స్పష్టం చేసారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని… విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.