రెచ్చిపోయిన సురేఖ, నీ బాబును రమ్మను
బిఆర్ఎస్, బిజెపి పార్టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పై చేస్తున్న విమర్శలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ పార్టీ పై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందన్న మంత్రి... ప్రజల నమ్మకాన్ని పొందేందుకు కెటిఆర్ రకరరాల జిమ్మికులు చేస్తూ ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేసారు.
బిఆర్ఎస్, బిజెపి పార్టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పై చేస్తున్న విమర్శలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ పార్టీ పై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందన్న మంత్రి… ప్రజల నమ్మకాన్ని పొందేందుకు కెటిఆర్ రకరరాల జిమ్మికులు చేస్తూ ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేసారు. బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అనేంత స్థాయిలేదన్నారు. సుదీర్ఘకాలంగా నల్గొండ ప్రజల ఆదరాభిమానాలు కోమటిరెడ్డి బ్రదర్స్ సొంతమన్న మంత్రి సురేఖ… హుజురాబాద్ ఎమ్మెల్యే ఓ పిచ్చోడు అంటూ కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నదన్నారు. బిఆర్ఎస్ అవినీతి, అక్రమాల కేసుల విషయంలో చట్టబద్ధంగా ముందుకుపోతున్నామని స్పష్టం చేసారు. సీఎం రేవంత్ రెడ్డిగారు బిఆర్ఎస్ హయాంలో ఎంతో అణచివేతకు గురైనా ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకార చర్యలకు దిగలేదన్న మంత్రి… సీఎం గనుక ప్రతికార చర్యలకు దిగాలని భావిస్తే, బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలకు అందరికందరు జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా, సహృద్భావ వాతావరణం వెల్లివిరేసాలా ప్రజాప్రతినిధుల మధ్య సంబంధాలుండాలని కోరారు. పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ ప్రజలకు చేసింది శూన్యం అని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంత చేస్తూ ప్రజల ముందు మరింత చులకనవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ కెటిఆర్ ను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు.