నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా…? లోకేష్ ఫైర్
శాసన మండలిలో వైసిపి సభ్యులపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయడన్న మంత్రి డోలా వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడి నుంచి లోకేష్ అందుకుని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

శాసన మండలిలో వైసిపి సభ్యులపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయడన్న మంత్రి డోలా వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడి నుంచి లోకేష్ అందుకుని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2014 – 19 మద్య లో చంద్రబాబు పారిపోలేదా అని వైసీపీ సభ్యులు అనగా… వైసిపి వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని తెలిపారు.
నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి చాలెంజ్ చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యే లు సభకు వచ్చారన్న లోకేష్… వైసిపి ఎమ్మెల్యే లు ఎందుకు సభకు రావడం లేదో చెప్పాలన్న లోకేష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్సా స్పందించారు. ఎవరిని అవమానించినా సమర్ధించేది లేదని స్పష్టం చేసారు. నాతల్లిని అవమానించ వారికి టిక్కెట్లు ఇచ్చారని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నాటి ఘటనలపై చర్చ సిద్దమా అని లోకేష్ సవాల్ చేసారు.