కేటిఆర్ నా ఏడుపు తగులుతుంది: సీతక్క సంచలన కామెంట్స్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్... చిట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అంటూ సవాల్ చేసారు. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని హితవు పలికారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 06:17 PMLast Updated on: Oct 02, 2024 | 6:17 PM

Minister Seethakka Fires On Ktr

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్… చిట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అంటూ సవాల్ చేసారు. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని హితవు పలికారు. మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుందన్నారు మంత్రి. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీ.ఆర్.ఎస్ పార్టీది అంటూ మండిపడ్డారు.

రాహుల్ గాంధీ కుటుంబం త్యాగము, కష్టము నిజాయితీ ముందు నువ్వెంత..? అని నిలదీశారు. రాహుల్ గాంధీనీ అనేస్తాయి కేటీఆర్ కాదు అన్నారు మంత్రి. బీసీ ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగామని తెలిపారు. మేం సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చాము ..ఎందుకు మా మీద అక్కస్సు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టిందని… బీ.ఆర్.ఎస్ ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్లోజర్ ప్రభుత్వం నడిపారన్నారు.

ప్రజలే స్వచ్ఛందంగా కూల్చుకుంటున్నారని తెలిపిన మంత్రి మూసి కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారన్నారు. మమ్మల్ని అసభ్యకరంగా దూషించి మమ్మల్ని శిఖండి అని ఎట్లా అంటారు..? అని నిలదీశారు. గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసన్నారు ఆమె. మేం నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్ళం కాదు.. ప్రజలను చేత ఎన్నుకున్న మంత్రులం, వెంటపడి మమ్మల్ని వేధిస్తున్నారు దుర్మార్గులు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పనికట్టుకొని సినిమా వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదని స్పష్టం చేసారు.