Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడైనా గెడ్డం తీస్తారా
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుపతికి వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన తిరుపతి వెళ్తున్నట్టు చెప్పారు. మొక్కు తీర్చుకోడానికి ఆయన వెళ్తుంటే మరో వాదన మాత్రం బాగా వినిపిస్తోంది. తిరుపతి వెళ్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ గెడ్డం తీస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది.
Uttam Kumar Reddy: పూర్తిస్థాయి మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో.. పదేళ్ల తరువాత కాంగ్రెస్ సీనియర్ నేతలు మంత్రులయ్యారు. అనుకున్నట్టు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరికి వాళ్లు మొక్కులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుపతికి వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన తిరుపతి వెళ్తున్నట్టు చెప్పారు. మొక్కు తీర్చుకోడానికి ఆయన వెళ్తుంటే మరో వాదన మాత్రం బాగా వినిపిస్తోంది.
Seethakka: హరీష్ రావుకు మంత్రి సీతక్క మాస్ కౌంటర్
తిరుపతి వెళ్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ గెడ్డం తీస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ తాను గెడ్డం గీసుకోనని అప్పట్లో ఉత్తమ్ శపథం చేశారు. 2016లో ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ చేశారు ఉత్తమ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే తాను క్లీన్ షేవ్ చేసుకుంటానని చెప్పారు. 2018లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని అప్పట్లో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కానీ అనుకోకుండా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.
కానీ 2023లో మాత్రం సింగిల్‌గానే సీన్ చూపించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడైనా ఉత్తమ్ గెడ్డం తీస్తారా అనే వాదన మొదలైంది. చూడాలి మరి గెడ్డంతో తిరుపతి వెళ్తున్న ఉత్తమ్ క్లీన్ షేవ్‌తో వస్తారా అలాగే వస్తారా అని.