బ్రేకింగ్: పోలీస్ విచారణకు మిథున్ రెడ్డి
జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై రెండు కేసులు నమోదు అయిన నేపధ్యంలో పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి ఎంపీ విచారణకు హాజరు అయ్యారు.

జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై రెండు కేసులు నమోదు అయిన నేపధ్యంలో పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి ఎంపీ విచారణకు హాజరు అయ్యారు. మిథున్ తో పాటు 29 మందిపై నమోదైన కేసులపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా పలమనేరు డీఎస్పీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పుంగునూరు అల్లర్ల కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్ పెట్టారు. మూడు నెలలు వరకు ఈ కండీషన్ అమలులో ఉంటుంది. రెండు కేసుల్లోనూ ఏ 1 ముద్దాయిగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు రెండు కేసుల్లో ఎంపీ మిథున్ నిందితుడుగా ఉన్నారు. ఇందులో భాగంగా జామీనుదారులతో కలిసి అధికారి ముందు విచారణకు హాజరు కానున్నారు.