నాకు ఎవడూ ఛాలెంజ్ కాదు: బాలయ్య సంచలనం
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ చైర్మన్ ఇంద్రజ రాజీనామా చేశారని వైసీపీతో విసిగి చెంది వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారన్నారు.

YPC is putting Deepika in check for Balayya in Hindupuram
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ చైర్మన్ ఇంద్రజ రాజీనామా చేశారని వైసీపీతో విసిగి చెంది వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారన్నారు. ఎన్నికలకు ముందే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి వచ్చారని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రతి వార్డుకు మంచి నీటిని అందిస్తాం…కావాల్సిన నిధులు కేటాయిస్తామన్నారు.
మున్సిపాలిటీ లో డంపింగ్ యార్డ్ ను మార్చి… క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామని హిందూపురం అభివృద్ధి కి కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. హిందూపురం ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. కియా పరిశ్రమ రావడంతో… ఇటు హిందూపురం కు అనేక పరిశ్రమలు వస్తాయని తెలిపారు. హిందూపురం అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడి ఉంటామని పద్మభూషణ్ అవార్డు వచ్చిన నటుడిగా నాకు సంతృప్తి కలగలేదన్నారు. పద్మభూషణ్ అవార్డు రావడం నాలో ఇంకా కసిని పెంచిందని వ్యాఖ్యలు చేసారు. నాకెవరూ చాలెంజ్ కాదు… నాకు నేనే ఛాలెంజ్ అన్నారు బాలయ్య. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని స్పష్టం చేసారు.