MLA JEEVANREDDY: ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..
రియర్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన జీవన్ రెడ్డి.. రీసెంట్‌గా ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను మెన్షన్ చేశారు. తన పేరుమీద, తన కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
MLA JEEVANREDDY: రాజకీయ నాయకులు అంటేనే మినిమం రిచ్ ఉంటారు. ఆమాత్రం ఉంటేనే ఈ రోజుల్లో రాజకీయాలు చేయగలుగుతారు మరి. చాలా మంది నేతలు తమతమ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణలో ఉన్న వెరీ రిచ్ ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు.
రియర్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన జీవన్ రెడ్డి.. రీసెంట్‌గా ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను మెన్షన్ చేశారు. తన పేరుమీద, తన కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ముందు నుంచీ మంచి సౌండ్ పార్టీగా ఉన్న జీవన్ రెడ్డికి 89 లక్షల 81 వేలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఆయన భార్య రజితా రెడ్డి పేరు మీద 2 కోట్ల 75 లక్షలు విలువ చేసే చరాస్తులు ఉన్నాయట. ఇక ఆయన పిల్లల పేరు మీద 27 లక్షల 26 వేల చరాస్తులు ఉన్నాయట. ఇక స్థిరాస్తులు కూడా భారీగానే చూపించారు జీవన్ రెడ్డి.
BRS SENTIMENT: బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా ? జాతీయ పార్టీని మడత పెట్టేశారా..?
ఆయన పేరు మీద 7 కోట్ల 66 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు. ఆయన భార్య పేరు మీద 11 కోట్ల 36 లక్షలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం తన దగ్గర లక్షా 98 వేల నగదు.. తన భార్య దగ్గర లక్షా 78 వేల నగదు.. తన పిల్లల దగ్గర లక్షా 3 వేల నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో మెన్షన్ చేశారు. తన దగ్గర ఉన్న బంగారం, వెండి వివరాలు కూడా అఫిడవిట్‌లో సమర్పించారు జీవన్ రెడ్డి.. తనకు వ్యక్తిగతంగా 570 గ్రాముల బంగారం, 1.65 కేజీల వెండి.. తన భార్యకు 1320 గ్రామలు బంగారం, 3.50 కిలోల వెండి.. తన పిల్లలకు 170 గ్రామలు బంగారం, 1250 గ్రాముల వెండి ఉన్నట్టు చెప్పారు.
ఇక కార్లు అంటే ఎంతో ఇష్టపడే జీవన్ రెడ్డి తనకు ఓ ఫోర్డ్ ఎండీవర్ కారు ఉన్నట్టు అఫిడవిట్‌లో చెప్పారు. తన కుటుంబ సభ్యుల కార్ల వివరాలు అఫిడవిట్‌లో చెప్పలేదు. ఇక తనకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు చెప్పారు జీవన్ రెడ్డి. ప్రస్తుతం తన పేరు మీద 11 లక్షల లోన్, తన భార్య పేరు మీద ఏకంగా 40 కోట్ల 70 లక్షల లోన్ ఉన్నట్టు చెప్పారు.