రేవంత్ రెడ్డి బ్రోకర్, బ్రోతల్: కౌశిక్ రెడ్డి ఫైర్

బంజారా హిల్స్ పోలీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్ ఏసీపీ కి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు... నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారు,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 05:49 PMLast Updated on: Dec 04, 2024 | 5:49 PM

Mla Koushik Reddy Fire On Revanth Reddy

బంజారా హిల్స్ పోలీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్ ఏసీపీ కి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు… నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారు, సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు అని… నేను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారు అని మండిపడ్డారు. డిజీపీ కన్నా ఎక్కువ ప్రోటో కాల్ ఎమ్మెల్యే కు ఉంటుందని సీఐ కి తెలియదా ? అని నిలదీశారు. ఏ ప్రజాప్రతినిధి కానీ సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని మండిపడ్డారు.

చివరకు బంజారాహిల్స్ పి ఎస్ సీఐ కి నా పిర్యాదు నిచ్చి రసీదు తీసుకున్నా అని… నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది నా ప్రధాన ఆరోపణ అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి ,ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్నారు. నేను ఓ మిత్రుడి పార్టీ కి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారని… నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ,శివధర్ రెడ్డి పై కేసు బుక్ చేయాల్సిందే ..ఎఫ్ .ఐ .ఆర్ .నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేసారు.

మా నేత హరీష్ రావు పై బ్రోకర్ రేవంత్ రెడ్డి సూచనతో బ్రోతల్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారన్నారు. బ్రోకర్ ,బ్రోతల్ లు కేసు పెడితే పోలీసులు హరీష్ రావు పై ఎఫ్ ఐ ఆర్ ఎలా నమోదు చేస్తారు ? అని నిలదీశారు. హరీష్ రావు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే నా కేసు విషయం లో సీఎం రేవంత్ ,డీజీపీ ,ఇంటెలిజెన్స్ ఐజీ పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేసారు. నేనిచ్చిన పిర్యాదు పై ఎఫ్ ఐ ఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని హెచ్చరించారు. మా అగ్ర నేతలందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రం లో భూ కంపం వచ్చిందన్నారు.