Raja Singh Lodh: అలక వీడని రాజాసింగ్.. పార్టీకి దూరం..
శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో.. రాజాసింగ్ హర్ట్ అయ్యారు. అలకపాన్పు ఎక్కారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే.. ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ.. పార్టీతో అంటీ ముట్టనట్లు కనిపిస్తున్నారు రాజాసింగ్.
Raja Singh Lodh: రాజాసింగ్.. విషయం సంగతి ఎలా ఉన్నా.. వివాదాలకు ఎప్పుడూ కేరాఫ్‌గా ఉంటాడీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కాంట్రవర్సీ కామెంట్స్ చేశారని ఒకప్పుడు ఈయనను పార్టీ బహిష్కరిస్తే.. హైదరాబాద్ టికెట్ విషయంలో ఈయన.. పార్టీనే బహిష్కరించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయ్. 2018ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచి.. అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా నిలిచిన రాజాసింగ్.. తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
MLC KAVITHA JAIL: తిహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 1న బెయిల్‌పై నిర్ణయం
ఐతే 2023నాటికి పరిస్థితులు రివర్స్ అయ్యాయ్. ఈ మధ్యలోనే రాజాసింగ్‌ని పార్టీ బహిష్కరించింది. ఎన్నికల ముందు తిరిగి అక్కున చేర్చుకుంది. ఐతే ఎన్నికల తర్వాత మళ్లీ ఆయనకు ప్రాధాన్యత తగ్గించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయ్. శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో.. రాజాసింగ్ హర్ట్ అయ్యారు. అలకపాన్పు ఎక్కారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే.. ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ.. పార్టీతో అంటీ ముట్టనట్లు కనిపిస్తున్నారు రాజాసింగ్. కీలక మీటింగ్‌లకు కూడా అటెండ్ కావడం లేదు. వరుసపెట్టి అన్నింటికీ డుమ్మా కొడుతున్నారు. ఆ మధ్య అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. గోషామహల్ నియోజకవర్గంలో నిర్వహించిన యాత్రలో కనిపించని రాజాసింగ్.. అమిత్ షా సభలోనూ పత్తా లేకుండా పోయారు. అప్పుడు అలిగారు.
ఇప్పుడు నార్మల్ అయి ఉంటారులే అనుకుంటే.. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల మీటింగ్‌కి కూడా రాజాసింగ్ డుమ్మా కొట్టారు. ఈ మీటింగ్‌కి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ రాజాసింగ్ మాత్రం డుమ్మా కొట్టారు. ఒకరకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ తిరుగుబాటు చేసినట్లే.. పరిస్థితులు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయ్. పోనీ పనుల్లో ఉండి రాలేకపోయారా అంటే.. ఫోన్ స్విచాఫ్ చేసి, పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండడం లేదు అనే గుసగుసలు వినిపిసిస్తున్నాయ్.