Seethakka: వరదల్లో సీతక్క సాయం.. అమ్మ మనసు మేడమ్ మీది..
ఉమ్మడి వరంగల్ జిల్లాను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. జనం కష్టం చూసిన సీతక్క.. జనంతోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. వరదలు మొదలైన క్షణంలోనే వరంగల్ వెళ్లిపోయారు. ప్రతీ ఇంటిని పలకరిస్తున్నారు. ప్రతీ మనిషిని ఓదారుస్తున్నారు.
Seethakka: కష్టం దాడి చేస్తుందంటే.. ఓ క్షణం ముందుండి, ఆ కష్టాన్ని ఎదిరించే రకం సీతక్క. జనంలో పుట్టిన నాయకురాలు, జనం మెచ్చిన నాయకురాలు. ఏ చిన్న వివాదం కానీ.. ఏ ఒక్క ఆరోపణ కానీ.. సీతక్క మీద వినిపించదు. ఆమె పేరు చెప్తే అమ్మ మనసు మాత్రమే వినిపిస్తుంది. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు సీతక్క పడిన కష్టం.. ప్రజల మనసును కదిలించింది. తెలంగాణను వర్షాలు వెంటాడుతున్నాయి.
నాలుగురోజులుగా కురుస్తున్న వానలతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎవరు ఉన్నారో.. ఎవరు తిన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వరదలు.. సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. జనం కష్టం చూసిన సీతక్క.. జనంతోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. వరదలు మొదలైన క్షణంలోనే వరంగల్ వెళ్లిపోయారు. ప్రతీ ఇంటిని పలకరిస్తున్నారు. ప్రతీ మనిషిని ఓదారుస్తున్నారు. నిజమైన నాయకురాలు అనిపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు ఉరకలెత్తుతుండగా.. చెరువులు మత్తడి పారుతున్నాయి. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చెరువులు అలుగులు పారుతున్నాయ్. గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులో భీముని పాదం జలపాతం ఉద్ధృతంగా జాలువారుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం మండలాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క విస్తృతంగా పర్యటించారు.
వంతెనలపై నుంచి పారుతున్న వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ధైర్యం నింపుతున్నారు. నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో కనిపించే రాజకీయ నాయకురాలు కాదు.. జనం కోసం జనంలో పుట్టిన నాయకురాలు అని మరోసారి నిరూపించారు. సీతక్క. కష్టం వచ్చినప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే.. ఇదే కావొచ్చని సీతక్క సాయం గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.