MLC Kavitha : విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు విచారణకు హాజరు కాలేనంటే ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. తన లీగల్ టీంతో ఈడీకి సమాచారం అందించారు. ప్రస్తుతం నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవితి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తరువాత బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ టీం, సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత.
విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్యే కవిత ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు విచారణకు హాజరు కాలేనంటే ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. తన లీగల్ టీంతో ఈడీకి సమాచారం అందించారు. ప్రస్తుతం నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవితి ఇవాళ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తరువాత బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ టీం, సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత.
కవిత పిల్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారంచిండంపై గతంలో కవిత సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌కు సంబంధించి ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విషయంలో ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగబోతోంది. ఈ కారణంగానే తాను విచారణకు రాలేనంటూ కవిత ఈడీ అధికారులకు సమాచారమిచ్చారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కవిత పిల్‌ను అంగీకరించి ఇంట్లోనే విచారించే విధంగా తీర్పు ఇస్తారా లేక ఖచ్చితంగా నిందితులు ఈడీ కార్యాలయానికి రావాలని చెప్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి కవిత రాసిన లేఖపై ఈడీ ఇంతవరకూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కవిత అభ్యర్థనను స్వీకరించి మరో డేట్ ఇస్తారా లేదా అనేది కూడా సస్పెన్స్‌గా మారింది.