బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ …ఇదేం గలీజ్ దందా? ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బాగోతం….

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు ... అన్నిట్లోనూ భాగస్వామి.2014....2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 03:50 PMLast Updated on: Feb 15, 2025 | 3:50 PM

Mlc Pochampally Srinivas Reddy Is A Key Leader In Trs

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు … అన్నిట్లోనూ భాగస్వామి.2014….2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు. మొయినాబాద్ లో శ్రీనివాస్ రెడ్డి కున్న ఒక ఫామ్ హౌస్ లో మామిడి తోట… మధ్యలో టెంట్లు.. లగ్జరీ కార్లు.. పందెం కోళ్లు.. ఓవరాల్ గా పెద్ద క్యాసినో దర్శనమిచ్చాయి పోలీసులకి. అదేంటి.. సంక్రాంతి అయిపోయి నెలైనా ఇంకా ఏంటీ హంగామా అనుకుంటున్నారా? మీరక్కడే పొరపడ్డారు! పందేనికి ఒక సీజన్ అనేది పాతమాట! పైసలుండాలేగానీ 365 రోజులు తోటలో ఆడిందే ఆట.. పాడిందే పాట! పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇంకా ఆపేదేలే..! తగ్గేదే లే..! అలా రెచ్చిపోయి గ్యాంబ్లింగ్‌కి అడ్డాగా మారిన మొయినాబాద్ ఫాంహౌజ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

తోలుకట్టలోని సర్వే నెంబర్ 165లో 11 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో చెన్నకేశవులు అనే వ్యక్తి నుంచి పోచంపల్లి కొనుగోలు చేసినట్టుగా రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ్యుటేషన్ కూడా అయిపోయినట్టు ఈసీలో చూపిస్తోంది. జోగినిపల్లి సంతోష్ రావుకు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆంతరంగికుడు! ఆయన దగ్గర్నుంచి ఈ ఫాం హౌజ్‌ని లీజుకు తీసుకున్న వ్యక్తి శివకుమార్ కూడా తాను బీఆర్‌ఎస్ టాప్ లీడర్లకు బాగా తెలిసినవాడినని చెప్పుకుంటాడు. రెండేళ్లుగా ఈ దందా జరుగుతున్నా.. ఇంతవరకు నిన్నటి వరకు బయటపడలేదంటే.. నిర్వాహకులు, ఓనర్లు ఏ స్థాయిలో మేనేజ్ చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.

మొయినాబాద్‌లోని పోచంపల్లి ఫాం హౌజ్‌లో కోళ్ల పందేలు జరుగుతున్నాయని పోలీసులకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఏదో చిన్నపాటిదే అయివుంటుందిలే అనుకున్నారు. కానీ వెళ్లి చూస్తే దిమ్మదిరిగిపోయింది. సకల సౌకర్యాలు. విశాలమైన మామిడితోట. టెంట్ల మధ్య బరులు. కేజుల్లో కోళ్లు. సేమ్.. సంక్రాతి టైంలో ఏపీలో ఎలాగైతే ఫ్లడ్ లైట్స్ పెట్టి పందేలు నిర్వహిస్తారో.. అదే స్టయిల్లో ఇక్కడ చూసి, ఎస్‌వోటీ పోలీసులు షాకయ్యారు. ఒక్క కోడి పందేలే కాదు. అక్కడ క్యాసినో కూడా రన్ చేశారు. కాకపోతే కాయిన్స్ బదులు కార్డ్స్‌ వాడారు. అంతా సిస్టమాటిక్. మొత్తం 64 మంది పట్టుబడ్డారు. అందులో 53 మంది ఏపీకి చెందినవారే. ఏడుగురు కూకట్‌పల్లి నుంచి వచ్చినవాళ్లు. మొత్తం 84 పందెం కోళ్లను పోలీసులు సీజ్ చేశారు. 46 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల 56 వేల క్యాష్ పట్టుబడింది. 55 కార్లలో వచ్చారు. అన్నీ లగ్జరీ వెహకిల్సే. ప్రస్తుతానికి శివకుమార్ ఒక్కడే ఆర్గనైజర్‌ అంటున్నారు పోలీసులు. ఈ రేంజిలో భారీ పందెం జరగడం మొదటిసారి కాదు.. ఇది మూడో సీజన్.

భీమవరం నుంచి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించి డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో తరలించారు. ఒక్కొక్క కోడిని ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని మరీ పట్టుకొచ్చారు. గంపగుత్తగా తెస్తే దారిలో దొరికిపోతామని చాలా పకడ్బందీగా షిఫ్ట్ చేశారు. ఆర్గనైజర్ శివకుమార్‌పై గతంలోనూ క్రిమినల్ కేసు లు ఉన్నాయి. ఫాంహౌజ్ ఎమ్మెల్సీ పోచంపల్లి పేరు మీద ఉండటంతో ఆయనకు కూడా నోటీసులు వెళ్లాయి. అయితే ఫామ్ హౌస్ తనదేనని …. దానిని నిర్వహించేది మాత్రం తన మేనల్లుడు జ్ఞానదేవ రెడ్డి అని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. అంటే తన ఫామ్ హౌస్ లో రెండేళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడా శ్రీనివాస్ రెడ్డి?పోచంపల్లి ఫామ్ హౌస్ లో రెండు సంవత్సరాలుగా క్యాసినో, కోడి పందాలు నడుస్తున్నాయని… ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, పోలీసులు చెప్తున్నారు. పారిపోయిన శ్రీనివాస రెడ్డి మేనల్లుడు జ్ఞానదేవరెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు.క్యాసినో కేసు సంగతి అలా ఉంచితే మొయినాబాద్ లో అన్ని ఫామ్ హౌస్ లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎలా వచ్చాయన్నది పెద్ద చర్చ.