బ్రేకింగ్: ఏపీకి మోడీ బిగ్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధానికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం చేయనుంది కేంద్రం.
అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. అమరలింగేశ్వర స్వామి ,ధ్యాన బుద్ధ వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై ,కలకత్తాకు అనుసంధానిస్తూ రైల్వే లైన్ చేపట్టనున్నారు. రైల్వే లైన్ తో దక్షిణ మధ్య ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు కానుంది. కాలుష్య నివారణకు 27 లక్షల చెట్లు నాటేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది.