Modi vs Obama: దొంగే.. దొంగను ‘దొంగా దొంగా’ అన్నట్టుంది..! మోదీపై కామెంట్ చేసే నైతిక అర్హత ఒబామాకు ఉందా..?

ఆస్కార్‌ అవార్డులు రాజకీయ నాయకులకు ఇస్తే అందరికంటే ఎక్కువ సంపాదించుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే. వేలాది మంది మరణాలకు కారణమైన ఒబామాకి 2009లోనే నోబుల్‌ శాంతి బహుమతి అవార్డు వరించింది. ఆ అవార్డుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 09:58 AMLast Updated on: Jun 26, 2023 | 9:58 AM

Modi Vs Obama Barack Obama Has Any Ethical Right To Question Pm Modi Over Protection Of Muslim Minority

Modi vs Obama: తమ స్వలాభం కోసం పక్క దేశాల్లో విధ్వంసం, వినాశనం సృష్టించడం అమెరికా నైజం. రూలింగ్‌లో ఏ అధ్యక్షుడు ఉన్నా కానీ అదే చేశాడు. ఒబామా ఏమీ శాంతిమూర్తి కాదు..!
రాజకీయాల్లో నటించేవాళ్ల కంటే జీవించేవాళ్లే ఉంటారు. బయటకు మంచిగా.. ఉత్తముడిగా కనిపిస్తూ చేయాల్సిందంతా చేస్తుంటారు. ఆస్కార్‌ అవార్డులు రాజకీయ నాయకులకు ఇస్తే అందరికంటే ఎక్కువ సంపాదించుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే. వేలాది మంది మరణాలకు కారణమైన ఒబామాకి 2009లోనే నోబుల్‌ శాంతి బహుమతి అవార్డు వరించింది. ఆ అవార్డుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కానీ 2008 నుంచి 2016వరకు అమెరికాను పాలించిన ఒబామా చేయకూడని పనులు ఎన్నోచేశారు. మీడియా అండను అడ్డుపెట్టుకోని నిజాలను తొక్కి పెట్టారు. అంతకుముందు పాలించిన బుష్‌ కంటే మిడిల్‌ఈస్ట్‌ దేశాలపై ఎక్కువ బాంబులు వేసిన ఘనుడు ఒబామా. అలాంటి ఒబామా సడన్‌గా ప్రధాని మోదీ గురించి కామెంట్స్ చేశారు. తానే ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే ఇండియాలో మైనార్టీల రక్షణ గురించి మోదీని వివరాలు అడిగి తెలుసుకునే వాడినని చెప్పాడు. మోదీ అమెరికా టూర్‌ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.
ఒబామా ఏమీ శాంతిమూర్తి కాదు
ఏడు ముస్లిం దేశాలు.. 26,171 బాంబులు.. ఇది ఒబామా ట్రాక్‌ రికార్డు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, లిబియా, ఇరాక్, సిరియా ఇలా ఏడు పేద ముస్లిం దేశాలపై ఒబామా సారధ్యంలోని అమెరికా బాంబుల వర్షం కురిపించింది. బయటకు టెర్రరిస్టులను చంపేశాం అని చెప్పుకున్నా.. ఈ దాడుల్లో అధికారికంగానే 1,124 మంది సామాన్యులు చనిపోయారు. అంటే ఒబామా ఆదేశాల కారణంగా వెయ్యికి పైగా ఏ పాపం చేయని ప్రజలు మరణించారు. ఇదేం చిన్న తప్పు కాదు. పెద్ద నేరం.. ఘోరం.. దారుణం..!

2016లో ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఒబామా గురించి ఈ లెక్కలు బయటకు తీశారు. మన లాగే అమెరికా మీడియా కూడా పార్టీలను బట్టి పని చేస్తుంటుంది. అక్కడ డెమొక్రాట్‌ పార్టీకి ఫేవరెటిజం ఎక్కువ. అందుకే ట్రంప్‌ అధికారంలోకి రాగానే ఆయన చేసిన చెత్తనంతా ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపించేవాళ్లు. అంతకముందు ఒబామాని మాత్రం శాంతి కోసమే పుట్టిన నెల్సన్‌ మండేలా లాగా బిల్డప్‌లు ఇచ్చి హైప్ ఇచ్చేవాళ్లు. ఒబామా ఎలాంటి వాడో తెలియలంటే మిడిల్‌ ఈస్ట్ దేశాల ప్రజలనే అడగాలి. ఎందుకంటే వాళ్లే బాధితులు. అమెరికా కారణంగా ఎప్పుడో దిక్కుతోచని స్థితిలోకి జారుకున్న ఆ దేశాలు ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మరింత విధ్వంసాన్ని చవిచూశాయి. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించింది. ఆమె అలా అనడం నిజంగానే వాలిడ్‌. అయితే గుజరాత్‌ మారణకాండ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న ‘మనోళ్ల’ని వెనకేసుకు రావడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఒబామాకి ఎలాగైతే నైతిక అర్హత లేదో.. ‘మనోళ్ల’కి కూడా అంతే లేదు!