సౌత్ నీదే, పవన్ కు మోడీషా బంపర్ ఆఫర్
జనసేనాని రేంజ్ మారబోతోంది... మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపి... పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటి సీఎం పవన్ ను వాడుకున్న బిజెపి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది.
జనసేనాని రేంజ్ మారబోతోంది… మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపి… పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటి సీఎం పవన్ ను వాడుకున్న బిజెపి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది. మరాఠా గడ్డపై పవన్ ప్రసంగాలు బిజేపికి 5 నియోజకవర్గాల్లో ఘనమైన విజయానికి బాటలు వేసాయి. అసలు గెలవని నియోజకవర్గంలో కూడా పవన్ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయింది. ఇది గమనించిన బీజేపి అగ్ర నాయకత్వం ఇక కాలయాపన చేయొద్దని ఫిక్స్ అయింది.
అందుకే సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ భుజానికి ఎత్తాలని బిజెపి అధిష్టానం వర్కౌట్ చేస్తోంది. సౌత్ లో బీజేపికి అంత పాజిటివ్ వాతావరణం లేదు. కర్ణాటక మినహా ఆ పార్టీకి బలమైన గ్రౌండ్ లేదనే చెప్పాలి. కర్ణాటకలో కూడా బిజెపికి బలమైన నాయకత్వం కరువైంది. తెలంగాణాలో ఇప్పుడిప్పుడే బలపడుతున్నా… బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎంత వరకు కంట్రోల్ చేస్తుందో క్లారిటీ లేదు. టీడీపీ సహకారంతో తెలంగాణాలో పార్టీ బలోపేతానికి వర్కౌట్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ లోకి వెళ్ళలేని నాయకులను బిజెపిలోకి తీసుకోకుండా టీడీపీలోకి పంపుతున్నారు.
ఇక మహారాష్ట్రలో బిజెపి తిరిగి అధికారం చేజక్కించుకుంది. ఇందులో పవన్ పాత్ర కూడా మరువలేనిది. కర్ణాటకలో మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా జనసేనానికి ఫాలోయింగ్ కాస్తో కూస్తో ఉంది. ఇక్కడ పవన్ తో బహిరంగ సభలకు బిజెపి వర్కౌట్ స్టార్ట్ చేస్తోంది. సనాతన ధర్మాన్ని పవన్ భుజానికి ఎత్తుకోవడం బీజేపి వ్యూహంలో భాగమే. పవన్ వేషధారణ, ప్రసంగాలు అన్నీ కూడా హిందువులకు బాగా దగ్గరవుతున్నాయి. వాస్తవంగా… పవన్ స్థాయిలో బీజేపికి సౌత్ లో హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న మాస్ లీడర్ ఇప్పటి వరకు దొరకలేదు. పవన్ ప్రసంగాలు నేషనల్ లెవెల్ లో కూడా హైలెట్ అవుతున్నాయి.
ఛాన్స్ దొరికితే తుక్కు రేగ్గొట్టే బీజేపి ఇప్పుడు పవన్ ద్వారా… సౌత్ లో హిందుత్వ వాదాన్ని బలోపేతం చేసేందుకు సిద్దమవుతోంది. తమిళనాట బిజెపికి అనుకూల పవనాలు లేవు. అక్కడ తెలుగు వారి సంఖ్య బలంగానే ఉంది. పవన్ కు అక్కడ ఫాలోయింగ్ ఉంది. హిందుత్వ వాదం తమిళనాట బలంగానే ఉన్నా… బిజెపికి పాజిటివ్ వాతావరణం లేదు. అందుకే ఇప్పుడు పవన్ ను అక్కడ కూడా ప్రయోగించి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. దక్షినాది వ్యాప్తంగా పవన్… సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తే అది కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ ను ఢిల్లీ పిలిచారు. మహారాష్ట్ర సిఎం ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ హాజరు అవుతారు.
అలాగే బిజెపి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ భేటీలో కూడా పవన్ పాల్గొంటారు. ఈ సందర్భంగానే పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనుంది బీజేపి. సౌత్ లో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. అ బలాన్ని అడ్డుకోవాలంటే పవన్ తో సాధ్యం అవుతుందని బీజేపి భావిస్తోంది. రాహుల్ గాంధీకి సౌత్ లో మంచి ఇమేజ్ ఉంది. పవన్ కు మూడు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉందని రుజువు అయింది. అందుకే ఇక ఆలస్యం చేయడం లేదు బీజేపి. జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్ చేసింది
ఈ సమయంలో సౌత్ కీలకం కానుంది… హిందీ బెల్ట్ లో మొన్నటి ఎన్నికల్లో బీజేపికి అంత పాజిటివ్ వైబ్స్ ఏం కనపడలేదు. అందుకే సౌత్ పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఏపీలో టీడీపీతో స్నేహం చెడకుండా… ఇతర రాష్ట్రాల మీద దృష్టి సారించి బలోపేతం కావాలని మోడీషా భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా దక్షినాది రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు. టీడీపీతో ఇబ్బంది లేకుండా నిధులు కేటాయింపు చేస్తూ సీఎం చంద్రబాబు డిమాండ్ లకు సహకరిస్తున్నారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ పై ముందు అడుగులు బలంగా పడుతున్నాయి.
తెలంగాణాలో కూడా బీజేపి రేవంత్ రెడ్డితో అంత దూరం ఏం ప్రదర్శించడం లేదు. అందాల్సిన సహకారం కూడా అందిస్తోంది. ఇక్కడ పవన్ ను కూడా రంగంలోకి దించితే… అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే శ్రీకారం చుడితే ఫలితం బాగుంటుంది అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం కనపడుతుందని బీజేపి ధీమా వ్యక్తం చేస్తుంది. నార్త్ ఫ్లేవర్ తెలంగాణాలో కనపడుతోంది. హిందీ ప్రభావం ఉంటుంది. అందుకే ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ… పవన్ ను రంగంలోకి దించేందుకు సిద్దమవుతుంది. అవసరమైతే జనసేనను బీజేపిలో విలీనం చేసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.