మనిషివా మోహన్ బాబువా…? షాక్ ఇచ్చిన పోలీసులు
కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర రౌడీగా మారిపోయాడు. తన ఇంటికి వెళ్ళిన కన్న కొడుకు, అలాగే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు.
కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర రౌడీగా మారిపోయాడు. తన ఇంటికి వెళ్ళిన కన్న కొడుకు, అలాగే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు. టీవీ9, టీవీ5 ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి దిగాడు. చేతిలోని మైక్ లాక్కుని రంజిత్ అనే విలేఖరి ముఖంపై మోహన్ బాబు దాడి చేయడంతో తీవ్ర గాయం అయింది.
దీనితో జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. దీనితో భారీగా పోలీసులు మోహన్ బాబు నివాసం వద్ద మొహరించాయి. మనోజ్ తన కూతురు లోపల ఉందని లోపలి వెళ్ళే ప్రయత్నం చేయగా అతనిపై కూడా మోహన్ బాబు దాడికి దిగాడు. ఈ ఘటనతో అలెర్ట్ అయిన పోలీసు ఉన్నతాధికారులు మోహన్ బాబు… గన్ ను స్వాధీనం చేసుకోవాలని, అలాగే విష్ణు గన్ ను కూడా సీజ్ చేసి వెంటనే స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అటు బౌన్సర్లు కూడా మీడియా ప్రతినిధుల ఫోన్ లు లాక్కోవడం వివాదాస్పదం అయింది.