Jagan : పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు.. జగన్
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు దక్కకపోవడంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పలాస సభలో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు.. ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా ? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు.. డిపాజిట్లు కూడా దక్కలేదు అంటూ జగన్ పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేశారు.

More votes for Barrelakka than Pawan: Jagan

ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు ప్రభుత్వం ఏమి చేసినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏడుస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. వీళ్ళు ఎక్కడో ఉంటూ.. ఏపీలో సీఎం ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారట. వీళ్ళంతా నాన్ లోకల్స్.. అయినా వీళ్ళు చెప్పినట్టు ఏపీ ప్రభుత్వం నడవాలట అని విమర్శించారు. చంద్రబాబు, పవన్ విషయంలో ఏపీ ప్రజలకు జాగ్రత్తగా ఉండాలనీ.. ఎక్కడా వివక్షా, లంచాలకు అవకాశం లేకుండా డైరెక్ట్ గా డబ్బులు అక్కా చెల్లెళ్ళ ఖాతాల్లో వేస్తుంటే.. ఏడుపే ఏడుపు అంటూ మండిపడ్డారు జగన్. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీబాధితుల సమస్యలకు పరిష్కారంగా తాగునీటి ప్రాజెక్టులు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. కిడ్నీ హాస్పిటల్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు.