బ్రేకింగ్: ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ?

వైసీపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డి పై ఆరోపణలు గతంలోనే తీవ్ర స్థాయిలో వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2025 | 04:15 PMLast Updated on: Apr 03, 2025 | 4:15 PM

Mp Mithun Reddy Arrested

వైసీపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డి పై ఆరోపణలు గతంలోనే తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇక పార్లమెంట్లో టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు లిక్కర్ స్కాం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి లిక్కర్ స్కాం ప్రధాన కారణం అని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో కీలక వైసిపి నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు.

డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేసి పెద్ద ఎత్తున నగదును విదేశాలకు తరలించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ అంశంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వివరాలు అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ టైం తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనితో ఆయనను అరెస్టు చేయవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా లిక్కర్ స్కాం తో పాటుగా భూ కబ్జా వ్యవహారాలపై ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ లు నిర్మించారని ఆరోపిస్తోంది టీడీపీ.