నాగార్జునపై ఒంటి కాలుమీద లేస్తున్న బీజేపీ
మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వారి బాధ్యతలు మర్చిపోయి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. పార్టీ అని తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జొన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలనీ 2010 లోనే హై కోర్టు తీర్పు ఇచ్చింది అన్నారు. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా నడిపిస్తున్నారు అని ఆరోపించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 లో మీరాలం ట్యాంక్ అక్రమ నిర్మాణాలను తొలగించారు అని గుర్తు చేసారు.
ఈరోజు మీరాళం ట్యాంక్ ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ వెళ్లి చూద్దాం రండన్న రఘునందన్ రావు అక్కడ మజ్లీస్ వాళ్లకి కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గింది అన్నారప. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేసారు.. వాటి పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు మండిపడ్డారు. 2014 లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలని హైకోర్టు తీర్పు ఇచ్చింది అని గుర్తు చేసారు. 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో ముక్కు పిండి వసూలు చేయాలి అని డిమాండ్ చేసారు. అప్పుడు ఎందుకు కూల్చలేదు ? నిలదీశారు. కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ మంత్రిగా పని చేసారు ఆయన తీసుకున్న చర్యలు ఎంటి ? మీ బీఅర్ఎస్ ఎంఎల్ఏ ల ఇల్లు లేవా? అంటూ ప్రశ్నించారు. హరీష్ , కవిత , కేటీఆర్ కు 111 జీవో పరిధిలో ఆస్తులు లేవా? వీటిని ఎందుకు కాపాడుతున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ముందు ముగ్గురు ఇల్లు కులగొట్టాండి జనవాడ ఫామ్ కొట్టడానికి రేవంత్ కు భయమెందుకు ?పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయపడకుండా మీ జేసీబీలను తీసుకుని మీరలం ట్యాంక్ దగ్గరికి రండి అని పిలుపునిచ్చారు. రాజ్ భవన్ రోడ్డు లో నాల పై బంగ్లా లు కట్టడం బాధాకరం కేటీఆర్ హయంలో కట్టిన అక్రమ నిర్మాణాలను తానే బాధ్యత వహిస్తూ కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. అలాగే ఎన్ కన్వేషన్ స్టే పై స్పందించిన రఘునందన్ రావు కోర్టు ఎన్ కన్వేషన్ మీద స్టే ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నారు. బరా బరా కూలగొట్టాల్సిందే అని పిలుపునిచ్చారు. కోర్టు కి నేను విజ్ఞప్తి చేస్తున్న …ఎన్ కన్వెన్షన్ మీద గతంలో తీర్పు ఇచ్చిన జడ్జిమెంట్ చూడండని కోరారు. ఏ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసి అధికారం పంచాయతీ కార్యదర్శులకు ఉందన్నారు.