ASSEMBLY ELECTIONS: విలక్షణ తీర్పు.. వీళ్లు గెలిస్తే.. వాళ్లు ఓడారు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేశారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కామారెడ్డి బరిలో దిగారు. అయితే, ఓటర్లు మళ్లీ బై పోల్‌కు ఛాన్స్ లేకుండా కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌ను కాదని బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డిని గెలిపించారు.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మళ్లీ ఉపఎన్నికలకు అవకాశం లేకుండా ఓట్లేశారు. అసెంబ్లీ బరిలోకి దిగిన ముగ్గురు బీజేపీ ఎంపీల్ని ఓడగొట్టారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిని మాత్రం అసెంబ్లీకి పంపారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి బై పోల్‌కు ఛాన్స్ లేకుండా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేశారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కామారెడ్డి బరిలో దిగారు.
CONGRESS: రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా.. అధిక సీట్లు గెలుచుకున్న హస్తం..
అయితే, ఓటర్లు మళ్లీ బై పోల్‌కు ఛాన్స్ లేకుండా కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌ను కాదని బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డిని గెలిపించారు. వీరిలో ఎవరు రెండు స్థానాల్లో గెలుపొందినా ఉపఎన్నిక అనివార్యమయ్యేది. కానీ ఓటమితో ఉప ఎన్నిక తప్పింది. బీజేపీ ముగ్గురు ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ముగ్గురికీ పరాభవం ఎదురైంది. కరీంనగర్‌లో గంగుల కమలాకర్ చేతిలో 3,163 ఓట్ల తేడాతో బండి సంజయ్ ఓడిపోయారు.
కోరుట్లలో ధర్మపురి అర్వింద్ 10 వేలకుపైగా ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. బోథ్‌లో ఎంపీ సోయం బాపూరావు 22 వేల 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు గెలిచారు. ఇక్కడ మాత్రం ఉప ఎన్నికలు తప్పేలా లేవు.