RAJAIAH, MUTHIREDDY: పాపం.. ఆగమైన్రు! పనిలోకి ఎక్కలే.. పదవులు పోయినయ్..!
ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా కార్పొరేషన్ చైర్మన్‌గా అయినా కొన్నేళ్లపాటు కొనసాగవచ్చని అనుకున్నారు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వాళ్ళే కాదు.. BRS సర్కార్ లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ ముందు ఇచ్చిన కార్పొరేషన్ పోస్టులను దక్కించుకున్న లీడర్లు కూడా పూర్తిగా కుదురుకోకముందే రిజైన్ చేయాల్సి వచ్చింది.
RAJAIAH, MUTHIREDDY: పాపం.. వాళ్ళిద్దరికీ పదవి చేతికి వచ్చినట్టే వచ్చిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోవడంతో.. పనిలోకి ఎక్కక ముందే వాళ్ళ పదవులు పోయినయ్. వాళ్ళిద్దరు ఎవరో కాదు.. ఒకరు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఇంకొకరు తాటికొండ రాజయ్య. ఈ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు BRS చీఫ్ కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల ముందు పార్టీలు మారకుండా.. కేసీఆర్ తెలివిగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ, తాటికొండ రాజయ్యకు రైతుబంధు చైర్మన్ పోస్టులు ఇచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో.. బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. కానీ కారు పార్టీ అధికారం కోల్పోవడంతో.. ఈ ముత్తిరెడ్డి, రాజయ్య పదవులు కోల్పోయారు. కనీసం కొలువులో ఒక్కరోజు కూడా కూర్చోకుండానే తప్పుకోవాల్సి వచ్చింది.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర గర్భ గుడి ఇదే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..
ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా కార్పొరేషన్ చైర్మన్‌గా అయినా కొన్నేళ్లపాటు కొనసాగవచ్చని అనుకున్నారు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వాళ్ళే కాదు.. BRS సర్కార్ లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ ముందు ఇచ్చిన కార్పొరేషన్ పోస్టులను దక్కించుకున్న లీడర్లు కూడా పూర్తిగా కుదురుకోకముందే రిజైన్ చేయాల్సి వచ్చింది. మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుంది.. ఆ పదవుల్లో కంటిన్యూ అవ్వొచ్చని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రావడంతో.. BRS అధికారానికి దూరమైంది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వాళ్ళంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య కూడా పదవులు వదులుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దాదాపు అందరు సిట్టింగ్‌లకు మరోసారి ఛాన్స్ ఇచ్చింది. కానీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. వీళ్ళిద్దరికి బదులు.. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో మరో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది BRS. తమకు టిక్కెట్లు రాలేదని ముత్తిరెడ్డి, తాటికొండ అలిగారు.
Seethakka: హరీష్ రావుకు మంత్రి సీతక్క మాస్ కౌంటర్
ఓ రకంగా అధిష్టానాన్ని ధిక్కరించి తమ నియోజకవర్గంలో సభలు కూడా పెట్టుకున్నారు. వీళ్ళకి ఇతర పార్టీల నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. రాజయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళితే.. ఎంతో కొంత బీఆర్ఎస్‌కు డ్యామేజీ అవుతుందని గ్రహించిన కేసీఆర్.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్‍గా, తాటికొండ రాజయ్యకు రైతు బంధు సంస్థ చైర్మన్‌గా పదవులు ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో.. వీళ్ళిద్దరూ ఆ సంస్థలోకి అడుగే పెట్టలేదు. ఇంతలోనే బీఆర్‍ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో.. ఈ ఇద్దరూ చైర్మన్ పదవులు వదులుకోవాల్సి వచ్చింది. ముత్తిరెడ్డి, రాజయ్య నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. కానీ వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు కాలేక, కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేక ఇప్పుడు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. వీరితోపాటు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కూడా ఎక్కువకాలం పదవిలో కొనసాగలేకపోయారు. అయితే బీఆర్ఎస్ టిక్కెట్లు దక్కించుకుని గెలిచిన పల్లా రాజేశ్వర్‍రెడ్డి, కడియం శ్రీహరికి కూడా నిరాశ తప్పలేదు.
కేసీఆర్ సర్కార్ వస్తే మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య.. ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పల్లా, కడియం శ్రీహరికి మళ్ళీ పోటీగా నియోజకవర్గంలో బలం పెంచుకోవాలా.. లేక అధికార పార్టీలోకి జంప్ చేయాలా అన్నది తేల్చులేకపోతున్నారు.