నా చెల్లెలు చీటర్, ఆస్తిలో వాటా వద్దు, తల్లిని చెల్లిని కోర్ట్ కు ఈడ్చిన జగన్
చెల్లెలుతో జగన్ రాయబేరం అంటూ వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఎల్లో మీడియా మషాలా దట్టించి రాసిన కథనాలు చీకట్లో బాణాలు అని ప్రూవ్ అయింది. చెల్లెతో రాజీ అనగానే అమితానందం పొందిన తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా నీరుగారిపోయారు.
చెల్లెలుతో జగన్ రాయబేరం అంటూ వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఎల్లో మీడియా మషాలా దట్టించి రాసిన కథనాలు చీకట్లో బాణాలు అని ప్రూవ్ అయింది. చెల్లెతో రాజీ అనగానే అమితానందం పొందిన తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా నీరుగారిపోయారు. సోషల్ మీడియాలో యమా సందడి చేసిన వాళ్ళు అందరూ ఒక్క వార్తతో సైలెంట్ అయిపోయారు. నా చెల్లెలు చీటర్, షేర్లు, ఆస్తులు ఏదీ ఇవ్వను అంటూ వైఎస్ జగన్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయడం చూసి అందరూ కంగుతిన్నారు. చెల్లె కాదు అన్న కూడా మొండి ఘటమే అంటూ షాక్ అవుతున్నారు.
అసలు ఏం జరిగిందో ఒక్కసారి వివరంగా చూస్తే…
ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో జగనన్ పలు పిటీషన్ లు దాఖలు చేసారు. కేసు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలు చేసారు. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో మరో పిటిషన్ దాఖలైంది. జరిగి నెల అవుతున్నా… ఇప్పటి వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. తాజాగా పయనీర్ అనే పత్రిక అసలు విషయం బయటపెట్టింది.
సెప్టెంబర్3వ తేదీన దాఖలు అయిన చేసిన పిటిషన్‌లకు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేసిన కోర్ట్ విచారణను వచ్చే 8వ తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్, అక్టోబర్ లో క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లను దాఖలు చేయగా… ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిలా రెడ్డి, వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా ప్రస్తావించారు.
సెప్టెంబర్ 3వ తేదీన దాఖలు అయిన పిటీషన్, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్‌లో జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దాఖలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నాయని ఈ ఏడాది దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ఆయా కంపెనీల షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో జగన్ పిటీషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం జగన్ ప్రస్తావించారు. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించినా… పలు కారణాలతో… కేటాయింపు చేయలేదని, వాటిని విత్ డ్రా చేసుకుంటామని తెలిపారు.
దీనితో షర్మిల, జగన్ మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయిలో ఉందనే విషయం క్లారిటీ వచ్చింది అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మొదట షర్మిలకు చెల్లెలు అనే ప్రేమతో షేర్లు ఇవ్వాలని చూసినా… షర్మిల రాజకీయ దూకుడు కారణంగా విత్ డ్రా చేసుకుని… తన తల్లికి మాత్రమే కొన్ని షరతులతో ఇవ్వాలని జగన్ భావించినట్టు సమాచారం. షర్మిల పేరును నేరుగా చెప్పకుండా ‘చీటర్” అనే పదాన్ని ఉపయోగించారు జగన్. కంపెనీలో తనకు 51% వాటాలు ఉన్నాయని ప్రకటించాలని, తన తల్లి, సోదరి కోసం కేటాయించిన వాటాల బదిలీని రద్దు చేయాలని జగన్ ట్రిబ్యునల్‌ను కోరుతున్నారు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.