తీన్మార్ సావిత్రిపై ప్రపంచ యాత్రికుడి బాంబ్.. జ్యోతక్క నీకిన్ని కోట్లు ఎక్కడివి..?

నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు.. ఒకప్పుడు ఈ పేరు చెబితే ఆయన యూట్యూబ్ వీడియోలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. మనోడు పేరు చెప్తే చాలు రెండు రాష్ట్రాల్లో యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ప్యాంట్స్ తడిసిపోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2025 | 07:46 PMLast Updated on: Apr 01, 2025 | 7:46 PM

Naa Anveshna Anvesh Sensational Comments On Siva Jyothi

నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు.. ఒకప్పుడు ఈ పేరు చెబితే ఆయన యూట్యూబ్ వీడియోలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. మనోడు పేరు చెప్తే చాలు రెండు రాష్ట్రాల్లో యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ప్యాంట్స్ తడిసిపోతున్నాయి. అదేదో యజ్ఞం చేసినట్టు అందరిని వరుస పెట్టి పట్టిస్తున్నాడు నా అన్వేషణ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చిన్న యూట్యూబర్ నుంచి… స్టార్ హీరోల వరకు అందరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్లకు వీలైనంతవరకు ప్రపంచ యాత్రికుడి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇప్పటికే చాలా మంది గురించి వీడియోలు చేశాడు అన్వేష్. ఒక్కొక్కరి మీద కేసులు నమోదు అయ్యేలా చేశాడు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. వాటిని అవసరం అయినప్పుడు బయట పెడతాను అంటూ వీడియోల మీద వీడియోలు విడుదల చేస్తున్నాడు. తాజా తగిన కన్ను ప్రముఖ యాంకర్ శివ జ్యోతిపై పడింది.

తన వీడియోతో తీన్మార్ సావిత్రికి చుక్కలు చూపించాడు ప్రపంచ యాత్రికుడు. ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండానే కేవలం నెల జీతంతో కోట్లకు కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలి అంటూ శివ జ్యోతిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అన్వేష్. గతంలో V6 ఛానల్ లో తీన్మార్ వార్తలకు యాంకర్ గా పని చేసి.. ఆ తర్వాత బిత్తిరి సత్తితో షోలు చేసిన శివ జ్యోతి ఒక్కసారిగా కోటేశ్వరరాలు ఎలా అయింది.. దానికి కారణం బెట్టింగ్ యాప్స్ కాదా అని ప్రశ్నించాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ బంజారాహిల్స్ లో శివ జ్యోతి కొనుగోలు చేసిందని కూడా ఈ వీడియోలో స్పష్టం చేశాడు. అలాగే ఓ BMW కారు కూడా కొనుగోలు చేసిందన్నాడు.

అదే సమయంలో తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి కూడా ఈ యాంకర్ కొన్నదని చెప్పాడు అన్వేష్. కేవలం ఒక మామూలు యాంకర్ గా ఉన్న ఈమెకు ఎన్ని కోట్లు ఎలా వచ్చాయి అంటూ ఆయన ప్రశ్నించాడు. ఇవన్నీ కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కాకపోతే ఎలా సంపాదించిందో అందరికీ చెప్పాలి అంటూ డిమాండ్ చేశాడు. శివ జ్యోతి సంపాదన మొత్తం కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి.. చాలామంది చావుకు కారణమైంది అంటూ సంచలనా రూపాలు చేశాడు. వెంటనే ఇలాంటి పనులు శివ జ్యోతి అక్క మానేయాలని… తెలంగాణ యాస భాషలో కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ యాత్రికుడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ప్రపంచ యాత్రికుడి వీడియో మీద శివ జ్యోతి ఎలా స్పందిస్తుందో చూడాలి.