NAGABABU TICKET : అనకాపల్లిలో నాగబాబు కర్చీఫ్.. టీడీపీకి మరో దెబ్బ
మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Nagababu) అనకాపల్లి లోక్‌సభ (Anakapalli Lok Sabha) సీటుకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈసారి పోటీ చేయను, పార్టీ బాధ్యతలు తన భుజాన ఉన్నాయని ఇన్నాళ్ళూ చెప్పిన నాగబాబు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో యాంటీ జగన్ వేవ్ నడుస్తోంది. అందువల్ల... ఆ ఎంపి సీటు ముచ్చట ఇప్పుడే తీర్చేసుకోవాలని అనుకుంటున్నారు.
మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Nagababu) అనకాపల్లి లోక్‌సభ (Anakapalli Lok Sabha) సీటుకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈసారి పోటీ చేయను, పార్టీ బాధ్యతలు తన భుజాన ఉన్నాయని ఇన్నాళ్ళూ చెప్పిన నాగబాబు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో యాంటీ జగన్ వేవ్ నడుస్తోంది. అందువల్ల… ఆ ఎంపి సీటు ముచ్చట ఇప్పుడే తీర్చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
పోల్ పాలిటిక్స్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారట సినీ నటుడు, జనసేన (Janasena)లో నంబర్ త్రీగా చెప్పుకునే నాగబాబు. ఈసారి ఆయన పోటీలో ఉంటారా? లేదా? అన్న చర్చ మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న టైమ్ లో… పోటీలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి తాజా అడుగులు. ఈసారి నియోజకవర్గాన్ని కూడా మార్చే అవకాశం ఉందంటున్నారు. తాను 2019లో పోటీ చేసి ఓడిపోయిన నర్సాపురం నుంచే మరోసారి బరిలో ఉంటారా? అన్న చర్చ మొదలైనప్పుడు… పార్టీ బాధ్యతను భుజాన కెత్తుకున్న కారణంగా 2024లో ఎక్కడా పోటీలో ఉండబోనని క్లారిటీ ఇచ్చారు. అయితే మారుతున్న రాజకీయానికి, పరిస్థితులకు అనుగుణంగా… తాజాగా నాగబాబు కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆయన అనకాపల్లి లోక్‌సభ సీటుకు పోటీ చేసే అవకాశం ఉందన్నది లేటెస్ట్ టాక్. నాగబాబు కూడా ఈ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు పెట్టారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే స్థానికంగా ఏం చేస్తామో హామీలు కూడా ఇచ్చివెళ్ళారాయన. అచ్యుతాపురంలో ఇప్పటికే ఇల్లు చూసుకున్న నాగబాబు వారం, పది రోజుల్లోనే ఇక్కడకు మకాం మార్చే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను నేరుగా పర్యవేక్షించడంతో పాటు ఎంపీగా గెలిపిస్తే….స్థానికంగా ఉంటానన్న నమ్మకాన్ని జనంలో కల్పించడమే దీని వెనక ఉద్దేశ్యమన్నది జనసేన వర్గాల మాట. జనసేన ఫస్ట్ లిస్ట్‌లోనే నాగబాబు పేరు ఉంటుందన్నది పార్టీ ఇంటర్నల్ టాక్.
జనసేన పరంగా చూస్తే…. అంతవరకు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా… అందుకు భాగస్వామ్య పక్షం టీడీపీ (TDP) ఒప్పుకుంటుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో 2019లో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు… మరోసారి అదే ఫార్ములాతో అనకాపల్లిని ఎంచుకుని ఉంటారనేది ఓ విశ్లేషణ. కానీ… ఇదే సీటు కోసం అంతకుముందు నుంచే తెలుగుదేశం పార్టీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. మాడుగులలో జరిగిన రా….కదలి రా సభ వేదికపై చంద్రబాబు ముందే ఈ ప్రస్తావన తెచ్చి అధిష్ఠానాన్ని ఇరుకున పడేశారు అయ్యన్న. ఇదే సీటు కోసం ఓ వలస నేత ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా అయ్యన్న వర్గం తిప్పికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది.. పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడుగా ప్రచారంలో వున్న ఆయన మాడుగుల సభలో అడుగు పెడితే… తాము హాజరు కాబోమని అయ్యన్న తెగేసి చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ చర్యల ద్వారా అనకాపల్లి ఎంపీ సీటుపై తాము ఎంత ఖచ్చితంగా ఉన్నామో మాజీ మంత్రి చెప్పకనే చెబుతున్నారన్నది లోకల్ టాక్. ఈ పరిస్థితుల్లో అయ్యన్న అసలు ఒప్పుకుంటారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. ఒకవేళ పొత్తు ధర్మానికి తలొగ్గి ఆయన ఒప్పుకున్నా… ఓట్ ట్రాన్స్‌ఫర్ అవుతుందా అన్న సందేహాలు రెండు పార్టీల నేతల్లో ఉన్నాయట.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం (Prajarajyam) తరఫున అల్లు అరవింద్ (Allu Aravind)ఇక్కడి నుంచే పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి చేతిలో ఓడిపోయారు. ఇప్పటి వరకు స్థానికేతరులు అనకాపల్లి ఎంపీలుగా గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు ఒకసారి… అవంతి శ్రీనివాస్ మరోసారి విజయం సాధించగా వీళ్లిద్దరూ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే విశాఖలో సెటిల్ అయ్యారు. ఆ కారణంగా వీళ్ళను వలస నేతలుగా ఇక్కడి జనం భావించలేదంటున్నారు. దీంతో ఇప్పుడు నాగబాబు పోటీ చేస్తారన్న వార్తలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదన్నది రాజకీయవర్గాల మాట. ప్రతిపక్ష అభ్యర్థి ఎవరో చూసి అందుకు దీటైన నాయకుడిని ఎంపిక చేయాలన్నది అధికార పార్టీ వ్యూహంగా తెలిసింది. టిడిపిలో బలమైన కాపు నాయకుడు బైరా దిలీప్ రెండేళ్లుగా అనకాపల్లిలోని వర్క్ చేసుకుంటున్నారు.
లోకేష్ అత్యంత సన్నిహితమైన బైరవ దిలీప్… హై కమాండ్ ఆశీస్సులతో అనకాపల్లి దిగిపోయారు. అక్కడ కాపు ఓట్లు, స్థానిక నేతల సహకారం రెండు దృష్టిలో పెట్టుకుని దిలీప్ చురుగ్గా పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరినప్పుడు ఆయనకు అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొణతాలను ఎమ్మెల్యే స్థానానికి పరిమితం చేయాలని జనసేన నిర్ణయించింది. ఇలా హాట్ సీట్ గా మారిన అనకాపల్లి ఎంపీ స్థానం కోసం నేరుగా నాగబాబు ల్యాండ్ అయిపోయారు. అయ్యన్నపాత్రుడుతో తలనొప్పి, బైరా దిలీప్ తో మరో హెడ్డేక్… వీటన్నిటిని కావాలనుకుంటే నాగబాబుకి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి టిడిపి అంగీకరిస్తే వ్యవహారం సర్దుమణిపోతుంది. పార్టీలో ఇంకెవరూ నోరు ఎత్తరు. పోటీ చేయాలని నాగబాబు దాదాపుగా డిసైడైన క్రమంలో ముందు ముందు ఇక్కడ టీడీపీ-జనసేన బంధం అనకాపల్లి బెల్లమంత స్వీట్‌గానే ఉంటుందో లేక గుంటూరు కారంలా ఘాటుగా మారుతుందో చూడాలి.