రాజ్య సభకు నాగబాబు..! మోడీ ని సెట్ చేసిన పవన్..
అన్న నాగబాబును రాజ్యసభకు పంపడానికి ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సిద్డంయ్యారా...? ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఢిల్లీ టూర్ లో లైన్ క్లియర్ చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
అన్న నాగబాబును రాజ్యసభకు పంపడానికి ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సిద్డంయ్యారా…? ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఢిల్లీ టూర్ లో లైన్ క్లియర్ చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో రాజీనామాలు చేసిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి.
మరి ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు. కాని ఇప్పుడు కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. 2019 ఎన్నికల్లో నాగబాబు… నర్సాపురం లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించి అన్నీ సిద్ధం చేసుకున్నారు. కాని… ఆ సీటు పొత్తులో భాగంగా బిజేపికి కేటాయించారు. దీనితో నాగబాబుకు నిరాశే ఎదురైంది.
పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న నాగబాబు… జనసేన కార్యకర్తలు, నాయకులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్ గానే ఉంటారు. ఈ తరుణంలో అప్పుడు పవన్… రాజ్యసభకు పంపిస్తాను అని తన అన్నకు మాట ఇచ్చాడు. ఇప్పుడు మూడు స్థానాలు ఏపీలో ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి జనసేనకు ఇచ్చేలా బిజెపి అధిష్టానాన్ని… ఏపీలో టీడీపీ అధిష్టానాన్ని పవన్ ఒప్పించుకున్నారు. తన అన్న ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడు అని… ఈ స్థానం తనకు కావాల్సిందే అని పవన్ పట్టుబట్టారు.
ఇక పవన్ ప్రాధాన్యతను గుర్తించిన బిజెపి అధిష్టానం… అందుకు వెంటనే ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా ఒప్పించారు పవన్ కళ్యాణ్. దీనితో నాగబాబు రాజ్యసభకు వెళ్ళడం నల్లేరు మీద నడక కానుంది. ఆయనతో పాటుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే గల్లా జయదేవ్, అశోక గజపతి రాజు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగబాబు వెళ్ళడం ఫైనల్ అయితే మాత్రం మెగా బ్రదర్స్ ముగ్గురూ… రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టినట్టే.
ప్రజారాజ్యం విలీనం తర్వాత… చిరంజీవి రాజ్యసభకు వెళ్లి కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక నాగబాబు కూడా రాజ్యసభకు వెళ్ళడం దాదాపుగా ఖరారు అయింది. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత నాగబాబు రైతు రాజ్యం అధ్యక్షుడిగా కూడా చేసారు. ఇక జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.