పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన నాగబాబు.. ఏం అనలేడు.. ఏం చేయలేడు..!
పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇప్పట్లో ఈయనను సినిమాలలో చూడడం కష్టమే. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తేనే మహా ప్రసాదం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇప్పట్లో ఈయనను సినిమాలలో చూడడం కష్టమే. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తేనే మహా ప్రసాదం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక అభిమానులు అయితే పవన్ నుంచి సినిమాలు ఆశించడమే మానేశారు. పొలిటికల్ పరంగా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ప్రజలు తనను నమ్మించిన అధికారం ఎక్కడ మిస్ యూస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈయన. అయితే ఎంత కేర్ తీసుకున్న ఏదో ఒక విషయంలో రాజకీయ నాయకులు దొరికిపోతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే బుక్ అవుతున్నాడు.. దానికి కారణం ఆయన అన్నయ్య నాగబాబు. అన్న కాబట్టి ఏమీ అనలేడు.. పార్టీ నుంచి పక్కకు కూడా తప్పించలేడు.
నాగబాబు నుంచి పవన్ కళ్యాణ్ కు వచ్చిన తలనొప్పులు ఏంటి అనుకోవచ్చు. అప్పుడప్పుడు మెగా బ్రదర్ మాట్లాడే మాటలు పవన్ ఇమేజ్ ను బాగా దెబ్బ తీస్తుంటాయి. తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు కానీ నాగబాబు చేస్తున్న కామెంట్స్ జనసేన పార్టీని కూడా డ్యామేజ్ చేస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా నాగబాబు తన పంతాలో తాను వెళుతూ ఉంటాడు. తాజాగా జనసేన పార్టీ నుంచి అధికారికంగా నాగబాబు పేరును ఎమ్మెల్సీ కోటాలో ప్రకటించారు. కుటుంబ రాజకీయాలు చేయొద్దు అని పవన్ కళ్యాణ్ చెబుతూనే ఇప్పుడు మళ్ళీ నాగబాబును ఎమ్మెల్సీ చేయడం ఏంటి అంటూ ఆయనను నిలదీస్తున్నారు. రాజకీయం అంటే నెపోటిజం కాదు కదా.. ఒకరు వచ్చారని అందరూ రావడానికి అంటూ ఇంతకుముందు పవన్ కొన్ని సభల్లో కామెంట్ చేశాడు. కానీ ఇప్పుడు తన అన్నయ్య నాగబాబును పార్టీ నుంచి ఎమ్మెల్సీ చేయడంతో ఆ వ్యాఖ్యలు ఆయనకే చెప్పి విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
గతంలోనూ కొన్నిసార్లు నాగబాబు విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాగబాబు కు ఎమ్మెల్సీ ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు అని పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ బలంగా వాదిస్తున్నారు. తమ్ముడి కోసం తన కెరీర్ మొత్తం త్యాగం చేసి.. జీవితాన్ని పవన్ కోసం అంకితం చేసిన నాగబాబుకు కాకపోతే ఈ పదవి ఇంకెవరికి ఇవ్వమంటారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గెలిచినప్పుడు అందరూ పక్కనే ఉంటారు కానీ ఓడినప్పుడు అండగా నిలబడ్డ వాడే కదా అసలైన సోదరుడు అంటూ నాగబాబును ప్రశంసలతో ముంచేస్తున్నారు జన సైనికులు. పవన్ రెండుసార్లు ఓడిపోయినప్పుడు పార్టీతో పాటే ఉన్నాడు నాగబాబు. తమ్ముడికి అప్పుడు అన్ని విధాలా సహకారం అందించాడు. ఎవరైనా జనసేన పార్టీని ఏదైనా అంటే మాటల తూటాలు పేల్చాడు. అందుకే నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ కు కూడా ప్రత్యేకంగా అభిమానం ఉంది. దాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ రూపంలో చూపించాడు. అవసరమైతే అన్నయ్యని మంత్రి చేయడానికి కూడా వెనకాడడం లేదు పవన్. ఎంతైనా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.